అంతొద్దు అనేసిన కళ్యాణ్‌ రామ్

అంతొద్దు అనేసిన కళ్యాణ్‌ రామ్

ఈమధ్య కాలంలో సినిమా లెంగ్త్ విషయంలో డైరెక్టర్లు.. ప్రొడ్యూసర్లు దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు సినిమా లెంగ్త్ ఎక్కువైన కొద్దీ ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుందని ఎడిటింగ్ టేబుల్ వద్ద కత్తెరకు పెద్ద పనే పెట్టేవాళ్లు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఈ నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

అర్జున్ రెడ్డి.. రంగస్థలం సినిమాలు పూర్తి 3 గంటలపాటు ఉంటాయి.  వీటి తరవాత రీసెంట్ గా వచ్చిన భరత్ అనేనేను.. నాపేరు సూర్య సినిమాలు కూడా దాదాపు 3 గంటల రన్ టైంతో వచ్చాయి. సినిమా ఎంటర్ టెయినింగ్ గా ఉండాలే కానీ రన్ టైం ఎక్కువైనా పెద్ద ఇబ్బంది కాకపోవడంతో సినిమాలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని అనుకున్న సీన్స్ అలాగే ఉంచుతున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మాత్రం ఈ విషయంలో డిఫరెంట్ గా వెళ్తున్నాడు. అతడు హీరోగా నటించి రొమాంటిక్ ఎంటర్ టెయినర్ నా నువ్వే రిలీజుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రన్ టైం రెండు గంటలకన్నా రెండు నిమిషాలు తక్కువే ఉంది. కేవలం 118 నిమిషాల్లో సినిమా పూర్తవ్వుతందట.

ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ లెంగ్త్ లో వస్తున్న సినిమా నా నువ్వే. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమకథను సింపుల్ అండ్ స్వీట్ గా చెబితేనే బాగుంటుందని.. అనవసరమైన రిస్క్ అక్కర్లేదనే ఉద్దేశంతో డైరెక్టర్ జయేంద్ర, హీరో కళ్యాణ్ రామ్ తక్కువ రన్ టైంకే ఫిక్సయిపోయారట. నా నువ్వే సినిమాలో పాటలు ఇప్పటికే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై ఇంట్రస్ట్ బాగానే క్రియేటయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు