రామ్‌ చరణ్‌ అందుకే పారిపోయాడట

రామ్‌ చరణ్‌ అందుకే పారిపోయాడట

సోషల్‌ మీడియా విప్లవాన్ని ముందుగా గుర్తించిన హీరోల్లో రామ్‌ చరణ్‌ కూడా ఒకడు. అయితే ట్విట్టర్‌ నుంచి చాలా త్వరగా వాకౌట్‌ చేసింది కూడా చరణే. ఫాన్స్‌తో ఇంటరాక్షన్‌కే కాకుండా యాంటీ ఫాన్స్‌ చేసే కామెంట్స్‌ కూడా సోషల్‌ మీడియాలో బోనస్‌గా వస్తుంది.

అయితే అసలు చరణ్‌ ఎందుకు అకౌంట్‌ డీయాక్టివేట్‌ చేసుకున్నాడనేది ఇంతకుముందెప్పుడూ చెప్పలేదు. సోషల్‌ మీడియాలో వుంటే ప్రతి విషయంపై స్పందించాలని చరణ్‌ అనుకునేవాడట. అప్పట్లో సెలబ్రిటీల నుంచి ప్రతి విషయంపై రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసేవారని, తెలియక కొన్నిసార్లు కొన్ని విషయాల్లో స్పందించి లేని తలనొప్పులు తెచ్చుకున్నానని, ఈ గోల అంతా దేనికని సోషల్‌ మీడియా నుంచి వెళ్లిపోయాడట. మళ్లీ తిరిగి వస్తానని అంటున్నాడు కానీ ట్విట్టర్‌లోకి మాత్రం రాడట.

ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఫోటోలు మాత్రం పోస్ట్‌ చేస్తుంటాడట. చరణ్‌కి ఫేస్‌బుక్‌ పేజ్‌ ఎలాగో వుండనే వుంది కనుక అక్కడే ఫాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతూ, ఇతర టాపిక్స్‌ గురించి కూడా పోస్ట్‌ చేసేస్తున్నాడు కనుక ట్విట్టర్‌లో అతను లేని లోటుని అభిమానులు ఫీల్‌ అవర్లెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు