అయ్యయ్యో ఆఫీసర్‌

అయ్యయ్యో ఆఫీసర్‌

నాగార్జున డేట్లయితే సాధించాడు కానీ రాంగోపాల్‌వర్మ ఆఫీసర్‌ని సేల్‌ చేసుకోలేకపోతున్నాడు. నాగార్జునలాంటి స్టార్‌ వున్నా రాంగోపాల్‌వర్మని ఎవరూ నమ్మడం లేదు. కనీసం టీజర్లు, ట్రెయిలర్లతో అయినా తిమ్మిని బమ్మిని చేసి అమ్మేసే అవకాశమున్నా వర్మకి అలా మాయ చేయడం కూడా కుదర్లేదు.

మామూలుగా కాంట్రవర్సీ సబ్జెక్టులు ఎంచుకుని, ఆసక్తికరమైన టీజర్లు కట్‌ చేసి అమ్మేసుకుంటూ వుంటాడు. కానీ నాగార్జునతో సినిమాకి అలాంటి కాంట్రవర్షియల్‌ సబ్జెక్ట్‌ ఏదీ కుదరకపోవడంతో తనకి తోచిన పోలీస్‌ కథ ఏదో తెరకెక్కించాడు. ఎప్పుడో జ్యూస్‌ అయిపోయిన వర్మ ఆఫీసర్‌లో ఎలాంటి ఆసక్తికరమైన అంశాన్ని జోడించలేకపోయాడు. ఎన్ని టీజర్లు వదిలినా, ట్రెయిలర్‌ రిలీజ్‌ చేసినా కానీ దీనిపై కనీస ఆసక్తి రేకెత్తలేదు. రిలీజ్‌ డేట్‌ ఏనాడో అనౌన్స్‌ చేసినా కానీ ఇంతవరకు బయ్యరే దొరకలేదు.

దీంతో విడుదల తేదీని వాయిదా వేసారు. కనీసం చివరి నిమిషంలో అయినా ఎవరో ఒకరు వచ్చి కొంటారని చూస్తున్నారు. మీడియాకి దూరంగా వుంటోన్న వర్మ ఆఫీసర్‌ పబ్లిసిటీ కోసం వస్తున్నాడట. కనీసం మీడియాలో అయినా ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడి తన సినిమా వైపు దృష్టి తిప్పుకోగలడేమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు