‘మహానటి’ని ఆ లెవెల్లో గుర్తిస్తారా?

‘మహానటి’ని ఆ లెవెల్లో గుర్తిస్తారా?

ఒక సినిమాను గొప్ప అని పొగడ్డం ఒకెత్తయితే.. గొప్ప అనిపించుకున్న కమర్షియల్‌గా కూడా సక్సెస్ కావడం మరో ఎత్తు. ఇలా అన్ని సినిమాలకూ జరగదు. క్లాసిక్ అనిపించుకున్న చాలా సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినవే. ఐతే ఈ బుధవారం రిలీజైన ‘మహానటి’ మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ చిత్రం తొలి షోతోనే క్లాసిక్ అనే గుర్తింపు తెచ్చుకుంది. దాంతో పాటే జనాల్ని కూడా థియేటర్లకు రప్పిస్తోంది. కమర్షియల్‌గానూ పెద్ద సక్సెస్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం కోసం నాగ్ అశ్విన్‌ అండ్ టీం పడ్డ కష్టానికి చాలా వరకు మంచి ఫలితమే దక్కుతోంది. ఐతే ఈ సినిమాకు వచ్చిన పేరు.. వస్తున్న డబ్బులో 90 శాతం సంతృప్తిని ఇచ్చాయనుకుంటే.. మిగతా పది శాతం సంతృప్తి పెద్ద స్థాయి అవార్డులు వచ్చినపుడు దక్కుతుంది. ఈ సంవత్సరానికి రీజనల్ స్థాయిలో నంది అవార్డులు.. ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఈ చిత్రం హవా సాగిస్తుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు.

కానీ జాతీయ స్థాయిలో ‘మహానటి’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మన దగ్గర గొప్ప అనుకున్న సినిమాలు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుల్ని మెప్పించలేదు. మహా అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రం అని ఒక అవార్డు ఇచ్చి సరిపెడతారు. మిగతా విభాగాల్లో పురస్కారాలు రావడం అరుదే. ‘బాహుబలి’కి ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి అవార్డులు కట్టబెట్టారు కానీ.. దానికి ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యేంత స్థాయి లేదని మనవాళ్లే అంగీకరించారు. దాంతో పోలిస్తే అదే ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ విషయ పరంగా గొప్ప అంటారు విశ్లేషకులు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ‘మహానటి’కి జాతీయ స్థాయిలో ఎలాంటి పురస్కారాలు దక్కుతాయో చూడాలి. దీనికి ఉత్తమ చిత్రంగా పోటీ పడే స్థాయి ఉంది. అలాగే కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డుకు గట్టి పోటీదారే. జెమిని గణేశన్ పాత్రలో జీవించిన దుల్కర్ సల్మాన్ సైతం కనీసం జ్యూరీ పురస్కారానికైనా అర్హుడే. ఇక దర్శకుడిగా నాగ్ అశ్విన్.. ఇతర సాంకేతిక నిపుణులు కూడా అవార్డు పోటీల్లో ఉండాల్సిన వాళ్లే. కనీసం రెండు మూడు పురస్కారాలైనా దక్కాల్సిన సినిమానే ఇది. కానీ జాతీయ పురస్కారాల కోసమే కొన్ని అవార్డు సినిమాలు.. ఉదాత్త కథాంశాలతో తెరకెక్కుతుంటాయి. ఇంత పెద్ద దేశంలో వివిధ భాషల నుంచి వందల కొద్దీ సినిమాలు అవార్డు పరిశీలనకు వస్తాయి. ఆ పోటీలో ‘మహానటి’ ఎక్కడుంటుందో చూడాలి.నటి’ని ఆ లెవెల్లో గుర్తిస్తారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు