వర్మ అందరినీ ఫూల్స్‌ని చేశాడుగా..

వర్మ అందరినీ ఫూల్స్‌ని చేశాడుగా..

ఆల్రెడీ ‘ఆఫీసర్’ సినిమాకు సంబంధించి ఒకటికి రెండు టీజర్లు వచ్చాయి. వాటికి అంత గొప్ప స్పందనేమీ రాలేదు. రామ్ గోపాల్ వర్మ-అక్కినేని నాగార్జున కాంబినేషన్‌కు తగ్గ కంటెంట్ వీటిలో కనిపించలేదు. మరి థియేట్రికల్ ట్రైలర్లో అయినా మార్పు చూపిస్తారేమో.. అందులో ఏమైనా కొత్తగా.. ప్రత్యేకంగా చూపిస్తారేమో అని అందరూ ఎదురు చూశారు. కానీ అలాంటి ఆశలు పెట్టుకోవడం తప్పే అని రుజువు చేసింది ‘ఆఫీసర్’ ట్రైలర్. ఇందులోనూ ఏ విశేషం కనిపించలేదు.

ఐతే ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసేలా ఏమీ చూపించకపోయినా ఓకే కానీ.. కనీసం కొత్త షాట్లు.. సీన్లతో అయినా ట్రైలర్ తీర్చిదిద్దాల్సింది కదా. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదు. జస్ట్ ఇంతకుముందు రిలీజైన రెండు టీజర్లను మిక్స్ చేసి ట్రైలర్ అని పేరు పెట్టి వదిలేశాడు రామ్ గోపాల్ వర్మ. కొత్తగా ఒక్కటంటే ఒక్క షాట్ కనిపించలేదు. అన్నీ చూసినవే. ప్రతి డైలాగ్ విన్నవే. కాన్సెప్ట్ ఏంటో చెబుతూ వేసిన థంబ్ నైల్స్ కూడా పాతవే.

మహా అయితే ఓ పది సెకన్ల కంటెంట్ కొత్తది చూపించి ఉంటారేమో. కొత్తగా ఇందులో కథానాయికతో ఒక డైలాగ్ చెప్పించారు. ఆరంభం.. ముగింపు అంతా ఇంతకుముందు చూసినవే. ఈ మాత్రం దానికి దీనికి కొత్తగా ట్రైలర్ అని చెప్పడమెందుకో? ఇదే ట్రైలర్ అయినపుడు మధ్యలో రెండో టీజర్ అంటూ ఇందులో ఒక పార్ట్ ఎందుకు రిలీజ్ చేసినట్లో? వర్మ తనదైన శైలిలో జనాల్ని ఫూల్స్‌ను చూసినట్లుగా ఉంది ఈ ట్రైలర్ చూస్తుంటే. అసలే సినిమాకు బజ్ లేదంటే ఇలా ప్రేక్షకులతో పరాచికాలు ఆడితే వాళ్లకు కాలకుండా ఉంటుందా? ఈ నేపథ్యంలో ‘ఆఫీసర్’కు ఎలాంటి ఓపెనింగ్స్ ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు