ఏపీ మంత్రికి ఎంగేజ్‌మెంట్ అయ్యింది!

ఏపీ మంత్రికి ఎంగేజ్‌మెంట్ అయ్యింది!

సాధార‌ణంగా మంత్రుల, నేత‌ల‌ ఇళ్ల‌లో పెళ్లిళ్లు త‌ర‌చుగా జ‌రుగుతాయి. కానీ, మంత్రి గారే పెళ్లి చేసుకోవ‌డం చాలా అరుదు. అయితే, అనూహ్యంగా అతి పిన్న వ‌య‌సులోనే మంత్రి అయిన భూమా అఖిల ప్రియ త‌న మ‌న‌సుకు న‌చ్చిన మ‌న్మ‌థుడిని పెళ్లాడారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఘ‌నంగా జ‌రిగింది. వ‌రుడు ఎవ‌రో కాదు... ఆమెకు ముందుగానే ప‌రిచ‌యం ఉన్న పారిశ్రామిక వేత్త భార్గవ్‌.

ఈ శుభకార్యంలో కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనుంది. గత కొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్‌ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. భార్గ‌వ్ మొద‌ట సాంబ‌శివ‌రావు కూతురిని పెళ్లాడారు. ఇటీవ‌ల వారు విడాకులు తీసుకున్నారు. అఖిల‌ప్రియ‌కు కూడా ఇప్ప‌టికే పెళ్ల‌య్యి భ‌ర్త‌తో విడాకులు తీసుకున్నారు. అనంత‌రం అఖిల - భార్గ‌వ్ ఒక‌రినొక‌రు ప్రేమించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఇష్టంతో ఒక్క‌ట‌య్యారు.

తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌గా, భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించారు. త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో అఖిల‌ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయంగా ప‌లు స‌వాళ్లు ఎదుర్కొంటూ వార‌స‌త్వంగా వ‌చ్చిన నైపుణ్యంతో బాగానే రాణిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు