సూసైడ్ చేసుకోవాల‌నుందన్న దంగ‌ల్ చిన్న‌ది

సూసైడ్ చేసుకోవాల‌నుందన్న దంగ‌ల్ చిన్న‌ది

పేరు ప్ర‌ఖ్యాతుల‌కు కొద‌వ లేదు. టాలెంట్ కు టాలెంట్‌.. దానికి గుర్తింపుగా పిన్న వ‌య‌సులోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న బాలీవుడ్ చిన్న‌ది.. దంగ‌ల్ న‌టి జైరా వ‌సీం. తాజాగా సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన మెసేజ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

గ‌డిచిన కొన్ని రోజులుగా తాను తీవ్ర‌మైన డిప్రెష‌న్ లో ఉన్న‌ట్లుగా పేర్కొన్న ఆమె పోస్టు షాక్‌కు గురి చేస్తోంది. త‌న‌కు అన్నింటి నుంచి కొంత విరామం తీసుకోవాల‌ని ఉంద‌ని.. నాలుగేళ్లుగా త‌న‌కు ఏదో జ‌బ్బు వెంటాడుతున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. ఊహించ‌ని అల‌స‌ట‌కుతాను త‌ర‌చూ లోన‌వుతున్న‌ట్లు పేర్కొన్న ఆమె.. త‌న‌కు ఎదురైన ఇబ్బందుల గురించి వివ‌రంగా వెల్ల‌డించింది.

ఒళ్లు నొప్పులు.. అసూయ‌.. నెర్వ‌స్.. బ్రేక్ డౌన్.. సూసైడ్ చేసుకోవాల‌నిపించ‌టం లాంటి ఇబ్బందుల‌తో పాటు.. ఒళ్లంతా వాపుల‌తోనూ బాధ‌ప‌డుతున్న‌ట్లుగా పేర్కొంది. గ‌డిచిన నాలుగేళ్లుగా తానీ ఇబ్బందుల‌కు గురి అయిన‌ట్లుగా చెప్పింది. రోజూ ఐదు యాంటీ డిప్రెసెంట్ మందులు వేసుకుంటున్న‌ట్లు చెప్పిన ఆమె.. కొన్ని సంద‌ర్భాల్లో రాత్రిళ్లు విప‌రీత‌మైన ఉత్సాహంతో ఆసుప‌త్రికి వెళ్లాల్సి వ‌స్తోంద‌ని చెప్పింది.

12 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నాన‌ని.. ఇప్పుడు త‌న‌కు 17 ఏళ్లు అని.. వైద్యం కోసం డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళితే.. ఈ వ‌య‌సులో డిప్రెష‌న్ ఏమిటి? అంటూ ప్ర‌శ్నిస్తున్నార‌న్నారు. త‌న‌ను ఏదో జ‌బ్బు పీడిస్తోంద‌ని.. కొన్ని సంద‌ర్భాల్లో విప‌రీతంగా నిద్ర పోతుంటాన‌ని.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో చాలా ఎక్కువ‌గా ఆహారం తీసుకుంటున్న‌ట్లుగా చెప్పింది.

పాతికేళ్లు దాటితే డిప్రెష‌న్ కు మందు ఉంటుంద‌ని.. త‌న‌కు ఇప్పుడా అవ‌కాశం లేద‌ని చెప్పింది. జైరా బాధ‌లు వింటుంటే అయ్యో అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. బాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ‌రైనా కాస్త జోక్యం చేసుకొని.. జైరా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తే మంచిది. ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి ధైర్యాన్ని అందించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నిండు మ‌న‌సుతో కోరుకుందాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు