సమంత బంపర్ హ్యాట్రిక్

సమంత బంపర్ హ్యాట్రిక్

పెళ్లి చేసుకోగానే హీరోయిన్ల పనైపోయిందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ పెళ్లి తర్వాత కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన కథానాయికగా సమంత తన ప్రత్యేకతను చాటుకుంది. గత ఏడాది అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత కొంత కాలం లైమ్ లైట్లో లేకుండా పోయింది. ‘రాజు గారి గది-2’ వచ్చింది కానీ మంచి ఫలితాన్నందుకోలేదు. కానీ కొత్త ఏడాదిలో సమంత జోరు మామూలుగా లేదు. కేవలం నెలన్నర వ్యవధిలో మూడు భారీ విజయాలతో ఆమె బంపర్ హ్యాట్రిక్ కొట్టేసింది.

మార్చి నెలాఖర్లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అందులో సమంత నటనకు గొప్ప ప్రశంసలు కూడా లభించాయి. ఇక రెండు రోజుల కిందటే ‘మహానటి’ లాంటి మెమొరబుల్ మూవీతో పలకరించింది సామ్. ఈ చిత్రంలోనూ సమంత పాత్ర.. నటన ప్రేక్షకుల మెప్పు పొందాయి. తాజాగా సమంత మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం తమిళంలో విడుదలైన ఆమెకొత్త సినిమా ‘ఇరుంబు తురై’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట సమ్మె తర్వాత రిలీజైన పెద్ద సినిమా ఇదే. ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్లే టాక్ అదిరిపోయింది. ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సమంత పాత్రకూ మంచి పేరు వస్తోంది.

విశేషం ఏంటంటే.. ఇదే రోజు ‘మహానటి’ తమిళ వెర్షన్ ‘నడిగర్ తిలగం’ కూడా రిలీజై ఇక్కడి లాగే ప్రశంసలు తెచ్చుకుంటోంది. మొత్తానికి విజయాలకు విజయాలు.. పేరుకు పేరు.. సమంత ఇప్పుడు మామూలు ఆనందంలో ఉండి ఉండదు. నెలన్నర వ్యవధిలో జోరు మరే హీరోయిన్ చూపించి ఉండదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు