సమంతలాగే గంటలో మార్చిన సోనమ్

సమంతలాగే గంటలో మార్చిన సోనమ్

పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఇంటి పేరు మార్చుకోవడం.. అనాదిగా ఉన్న ఆచారమే. ఇలా ఎందుకు మార్చుకోవాలి అనే ప్రశ్న ఈ మధ్య తరచుగానే తలెత్తుతోంది. దీనిని సమర్ధించేవాళ్లు ఉన్నారు.. విమర్శించే వారూ ఉన్నారు. రెండు పేర్లను కంటిన్యూ చేసే ఐశ్వర్యారాయ్ బచ్చన్ వంటి వారు కూడా కనిపిస్తారు.

అయితే.. కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఏ మాత్రం మొహమాట పడకుండా.. అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తమ ఇంటిపేరును మార్చేసుకుంటూ.. తమ తమ ఉద్దేశ్యాలు ఏంటో స్పష్టంగానే చెప్పేస్తున్నారు. టాలీవుడ్ లో చూస్తే.. టాప్ బ్యూటీ సమంత ఇలాగే తన పేరు మార్చుకుంది. పెళ్ళయిన ఐదు నిమిషాలకే ట్విట్టర్ హ్యాండిల్ తన పేరును సమంత రుత్ ప్రభు నుంచి.. సమంత అక్కినేని అని మార్చేసింది. సామ్ ఇంత వేగంగా రియాక్ట్ కావడం.. తన ఇంటి పేరు మార్చుకునేందుకు ఏ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం బాగా ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా సేమ్ టు సేమ్ ఇదే పని చేసేసింది. పెళ్ళయిన గంటలో ట్విట్టర్ హ్యాండిల్ లో తన పేరును సోనమ్ కె అహూజా అని ఛేంజ్ చేసేసింది సోనమ్. అంటే సోనమ్ కపూర్ అహూజా అన్న మాట. రెండు ఇంటిపేర్లూ ఉంచుకునే ట్రెండ్ ను కంటిన్యూ చేసింది. కరీనా కపూర్ ఖాన్ అంటూ ఇప్పటికే ఓ కపూర్ బ్యూటీ ఇలాగే పేరు సెట్ చేసుకోగా.. ఇప్పుడు సోనమ్ కూడా అదే పని చేసేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English