నితిన్ కోసం ఫిదా సెంటిమెంట్

నితిన్ కోసం ఫిదా సెంటిమెంట్

యంగ్ హీరో నితిన్ రెండు వరుస ఫ్లాపు సినిమాలు ఇచ్చి బాగా డిజప్పాయింట్ అయ్యాడు. అయితే.. త్వరగా తన నెక్ట్స్ ప్రాజెక్టుకు వెళ్లిపోయి.. శ్రీనివాస కళ్యాణంపై దృష్టి పెట్టేశాడు. ఇప్పుడీ సినిమా దాదాపు పూర్తి కావచ్చేసింది కూడా.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు.. ఇంకా మరికొంత మాత్రమే షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉంది. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం.. జూన్ చివరి వారానికి కంప్లీట్ అయిపోతుందట. అయితే.. ఈ చిత్రానికి ఫిదా సెంటిమెంట్ ను అప్లై చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. గతేడాది జూలై 21న వచ్చిన ఫిదా మూవీ.. 50 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి.. చిన్న సినిమాలకు బాహుబలి అయిపోయి.. ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ డేట్ పై కన్నేసిన దిల్ రాజు.. నితిన్ హీరోగా రూపొందుతోన్న శ్రీనివాస కళ్యాణంను కూడా అదే రోజున విడుదల చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది.

రాజమండ్రి సమీపంలోని గ్రామంలో వేసిన భారీ సెట్ లో సుదీర్ఘమైన షూటింగ్ జరుపుకున్న శ్రీనివాస కళ్యాణం యూనిట్.. ఆ తర్వాత రాజస్థాన్ వెళ్లింది. రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ చివరి దశకు వచ్చిన తర్వాత.. శ్రీనివాస కళ్యాణం ప్రచారం ప్రారంభిస్తారట. శతమానం భవతి తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు