రోజూ హగ్ ఇచ్చి గుర్తు చేసిన కీర్తి

రోజూ హగ్ ఇచ్చి గుర్తు చేసిన కీర్తి

మలయాళీ భామ అయిన కీర్తి సురేష్.. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ అయిపోయినట్లే. వరుసగా ఇక్కడే సినిమాలు ఒప్పుకోవడం.. ఒకదాని వెనుక ఒకటి చొప్పున హిట్స్ కొట్టేస్తుండడం గమనించాలి.

ఇప్పటివరకూ కీర్తి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు మహానటి మూవీతో కీర్తి ఎన్నో మెట్లు ఎక్కేసింది. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటనను అసామాన్యం అనేస్తున్నారు జనాలు. దర్శకుడి ఊహాజనిత పాత్రను పోషించడమే.. సవాల్ అనుకుంటాం. కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ను.. అందులోనూ సావిత్రి లాంటి ఎవర్ గ్రీన్ అద్భుత నటి పాత్రను పోషించి మెప్పించడం అత్యంత క్లిష్టమైన విషయం. ఇందుకోసం ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది కీర్తి సురేష్. మహానటి మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డాని సాంచెజ్.. సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహించాడు.  ప్రతీ రోజు తనను ఉదయాన్నే పలకరించే కీర్తి సురేష్.. ఓ విషయం మాత్రం గుర్తు చేస్తూనే ఉండేదిట.

'ఉదయాన్నే హగ్ ఇచ్చుకుని పలకరింపులు పూర్తయిన వెంటనే.. నన్ను లావుగా చూపించడం మరచిపోవద్దు అని రోజూ గుర్తు చేసేది. ఇలా లావుగా చూపించమని అడిగిన ఏకైక హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రమే' అని చెప్పాడు డాని. పీరియాడిక్ ఫిలిం మాత్రమే కాకుండా.. ఎమోషనల్ కంటెంట్ కావడంతో.. అందుకు తగినట్లుగా కలర్ ప్యాటర్న్స్ ను ఎంచుకోవడం కష్టతరం అయిందని అన్నాడు డాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు