బయోపిక్ లు అందుకే బాగుంటాయ్ మరి

బయోపిక్ లు అందుకే బాగుంటాయ్ మరి

ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ లో అయితే మరీ పీక్స్ లో ఉంది. టాలీవుడ్ లో ఓ ఫిలిం పర్సనాలిటీపై రూపొందిన తొలి బయోపిక్ మహానటి. ఈ చిత్రం సాధిస్తున్న సక్సెస్.. తెచ్చుకున్న క్రేజ్ అసామాన్యం. దర్శకుడు పడిన కష్టం.. నిర్మాతలు నమ్మిన వైనం.. టెక్నికల్ టీం బ్రిలియన్స్.. అన్నిటికీ మించి నటీనటుల నటనా ప్రతిభ ఆ చిత్రాన్ని ఆ స్థాయికి చేర్చుతున్నాయి. త్వరలో తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ కూడా వస్తోంది. హిందీలో అయితే సంజయ్ దత్ బయోపిక్ రానుంది.

ఇప్పటికే సక్సెస్ సాధించిన దంగల్ అయినా.. చక్ దే ఇండియా అయినా.. రుస్తోం అయినా.. రీసెంట్ గా ప్యాడ్ మ్యాన్ అయినా.. అన్నీ సక్సెస్ లే. ఇందుకు కారణం ఆయా సినిమాల్లో కథ స్ట్రాంగ్ గా ఉండడమే. కథ బాగుంటే.. దాన్ని బాగా తీస్తే విజయం ఖాయం అనే సంగతి ఈ బయోపిక్ ల వరుస విజయాలను చూస్తే అర్ధం అవుతుంది. ఇంతకీ ఈ విజయాల వెనుక సీక్రెట్ 'కథే' అనే విషయం అర్ధమవుతూనే ఉంది కదా.

మరి ఆ కథలు రాసినది ఎవరు.. సాక్షాత్తూ ఆ దేవుడే కదా! మనుషులు రాసిన కథల కంటే దేవుడు రాసిన కథలు ఎప్పుడూ బాగుంటాయి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది కథలను రాసే ఆ భగవంతుడు.. ప్రతీ కథను విభిన్నంగా ఆసక్తిగా మలుస్తుంటాడు. ఆయన కంటే క్రియేటివ్ గా.. కొత్తగా ఎవరు ఆయా వ్యక్తుల కథను రాయగలరు చెప్పండి. అందుకే బయోపిక్స్ అనగానే అంతగా మనల్ని మెప్పించేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English