సీరియస్ కథలు వద్దు బన్నీ.. ప్లీజ్

సీరియస్ కథలు వద్దు బన్నీ.. ప్లీజ్

అల్లు అర్జున్ వరుస విజయాల ట్రెండ్ కు బ్రేక్ పడినట్లుగానే ఉంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా మూవీ ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత నిలకడ చూపించలేకపోయింది. యావరేజ్ కంటెంట్ తో కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ రిజల్ట్ సాధించడం అల్లు అర్జున్ కు అలవాటు.

సన్నాఫ్ సత్యమూర్తి.. సరైనోడు.. డీజే.. మూవీస్ సక్సెస్ మాత్రమే కాదు.. భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాల సక్సెస్ కు ప్రధాన కారణం.. ఫ్యామిలీ ఆడియన్స్. ఈ సినిమాల్లో ఉన్న ఫన్ కంటెంట్ ను బాగా ఎంజాయ్ చేశారు. కానీ బన్నీకి మాత్రం సీరియస్ సినిమాలు అంటే మహా ఇష్టం. అందుకే మధ్యమధ్యలో ప్రయోగాలు చేస్తుంటాడు. వరుడు.. బద్రీనాథ్.. గతంలో బన్నీ చేసిన సీరియస్ ఫిలిమ్స్. వీటిలో కామెడీకి అంత దూరంలో ఉంటాడు బన్నీ. ఆ రెండు సినిమాలు దెబ్బ కొట్టిన విషయం తెలిసినా.. ఇప్పుడు మళ్లీ నా పేరు సూర్యతో అదే పని చేశాడు బన్నీ.

అల్లు అర్జున్ కు సీరియస్ సినిమాలు అచ్చి రావడం లేదు. వీటిలో బన్నీ కష్టం బాగానే కనిపిస్తుంది. కొంతమంది స్టార్ హీరోలు చొక్కా నగలకుండా సినిమా చేసేస్తుంటే.. మనోడు మాత్రం ఒళ్లు హూనం చేసేసుకుంటూ ఉంటాడు. కానీ అంత కష్టపడినా.. బన్నీని ఇంతటి సీరియస్ సినిమాల్లో జనాలు మెచ్చలేకపోతున్నారు. అందుకే ఇక నుంచి ఇలాంటి సీరియస్ థీమ్స్ ఒప్పుకునే ముందు కాసింత ఆలోచించు బన్నీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు