కాలా.. భయపెట్టడం ఖాయమా??

కాలా.. భయపెట్టడం ఖాయమా??

రజినీకాంత్ రీసెంట్ మూవీస్ ఏవీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. సూపర్ స్టార్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి చేసేసి.. రిలీజ్ కి రెడీ చేసేశారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.ఓ కోసం.. పా రంజిత్ రూపొందించిన కాలా చిత్రాన్ని హోల్డ్ చేశారు కూడా. అయితే.. 2.ఓ ఇంకా ఆలస్యం కావడం ఖాయం అని తేలడంతో.. ఏప్రిల్ 27న విడుదల చేయాలని భావించారు.

కానీ అక్కడి సమ్మె కారణంగా జూన్ 7న విడుదలకు కాలా సిద్ధమైంది. టీజర్ తోనే కంప్లీట్ గా కబాలి థీమ్ తోనే ఈ కాలా కూడా ఉండబోతోందనే సంగతి అర్ధం అయిపోయింది. రీసెంట్ గా ఈ చిత్రానికి ఆడియో కూడా రిలీజ్ చేశారు. ఈ ఆడియోలో ఏకంగా 8 పాటలు ఉన్నాయి. సంతోష్ నారాయణ్ అందించిన ఈ పాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయాయి. పైగా అభిమానులను ఈ పాటలు భయపెట్టేస్తున్నాయ్ కూడా. చూస్తుంటే కాలా కూడా కాల్చడం ఖాయమేనా అనిపించక మానదు.

కబాలి సమయంలో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసి తుస్సుమనిపించారు. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టరు.. అదే థీమ్.. మాఫియా బ్యాక్ గ్రౌండ్ లోనే రూపొందిన మూవీ.. పైగా 2.ఓ షూటింగ్ గ్యాప్స్ లోనే కాలాను ఫినిష్ చేసేసిన వైనం.. అన్నీ కలగలిపి చూస్తే మళ్లీ కబాలి నాటి పీడకలను కాలా గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఏ మాత్రం బజ్ లేని  ఈ మూవీ ప్రచారానికి.. రజినీ అండ్ టీం ఏం చేయనున్నారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు