అనుకున్నవి దెబ్బేశాయ్.. అనుకోనివి అడేశాయ్

అనుకున్నవి దెబ్బేశాయ్.. అనుకోనివి అడేశాయ్

సహజంగా సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని అంచనాలను అందుకుంటాయి. మరికొన్ని మిస్ అవుతూ ఉంటాయి. కానీ వరుసగా అన్ని సినిమాలు.. అంచనాలకు భిన్నంగా రిజల్ట్ ఇవ్వడం మాత్రం అసలు ఊహించలేదు.

2018 ఆరంభంలో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి అంత దారుణమైన కంటెంట్.. రిజల్ట్ ఎవరైనా ఊహించారా.. బ్లాక్ బస్టర్ అనుకుంటే డిజాస్టర్ అయిపోయింది. రామ్ చరణ్ మూవీ రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అవుతుందని కూడా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేకపోయారు. ఏకంగా మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150ని కూడా దాటేసి దూసుకెళ్లపోయింది. ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేనుపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.  కొరటాల-మహేష్ కాంబినేషన్ కావడమే ఇందుకు కారణం. రంగస్థలం రికార్డులను బ్రేక్ చేసేస్తుంది అంతా అనుకున్నారు కానీ ఈ సినిమా జస్ట్ సక్సెస్ అనిపించుకుని ఆగిపోతోంది.

అల్లు అర్జున్ రీసెంట్ రిలీజ్ నా పేరు సూర్య ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బన్నీ ఉన్న ఫామ్ కి.. ఇది కూడా ఊహించని ఫలితమే అని చెప్పుకోవాలి. ఇక మహానటి విషయానికి వస్తే.. ఓ చిన్న సినిమా అనుకున్న చిత్రం.. ఇప్పుడు పెద్ద రికార్డులపై కన్నేసి దూసుకుపోతోంది. ఇది అస్సలు ఏ ఒక్కరు ఊహించని ఘన విజయం. ఇక ఫిబ్రవరిలో వచ్చిన నాగశౌర్య మూవీ ఛలో కూడా బ్లాక్ బస్టరే. అంచనాలకు తగినట్లుగా ఫలితం ఇచ్చిన మూవీ బహుశా ఈ ఏడాది తొలిప్రేమ ఒక్కటే. మిగతా సినిమాల విషయంలో మాత్రం.. అనుకున్నవి దెబ్బేశాయ్, అనుకోనివి అడేశాయ్!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు