చరణ్ మంచి ముహూర్తంలో మొదలుపెట్టేస్తాడట

చరణ్ మంచి ముహూర్తంలో మొదలుపెట్టేస్తాడట

ఈ మధ్య మన స్టార్లందరూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోతున్నారు. రిజర్వ్డ్ ఉండే హీరోలు సైతం సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. మీడియా.. సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయి లేని పోని రూమర్లు ప్రచారం చేస్తుండటం.. నెగెటివ్ క్యాంపైన్లు కూడా పెరిగిపోవడంతో హీరోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండక తప్పని పరిస్థితి. తమ సినిమాల ప్రమోషన్లకు కూడా ఇది మంచిదని భావిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేడు. ఒక్క ఫేస్ బుక్ ద్వారా మాత్రం అప్ డేట్స్ ఇస్తుంటాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మాత్రం దూరమే. ఐతే మంచి ముహూర్తం చూసి త్వరలోనే తాను కూడా ఆ రెండు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెట్టేస్తానని అతను అన్నాడు.

ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సోషల్ మీడియా అంటే ముందు నుంచి తనకో భయం ఉందని.. ఇంతకుముందు ట్విట్టర్ అకౌంట్ ఉన్నప్పటికీ ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడి తర్వాత దాన్ని క్లోజ్ చేసేశానని చెప్పాడు చరణ్. కానీ సోషల్ మీడియాలోకి రావాలని అభిమానులు ఒత్తిడి తెస్తున్నారని.. దాని అవసరాన్ని కూడా గుర్తించి తాను త్వరలోనే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు తెరవాలని నిర్ణయించుకున్నానని అతను చెప్పాడు.

 ఇక తాను-ఉపాసన పిల్లలు కనడం గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడాడు. త్వరలో ఉండొచ్చని చెప్పాడు. బాలీవుడ్లో చేసిన ‘జంజీర్’ సినిమా ఫ్లాపవడం నిరాశ కలిగించిందని.. కానీ దాన్నుంచి త్వరగానే బయటపడ్డానని చెప్పిన చరణ్.. మళ్లీ అవకాశముంటే హిందీలో నటిస్తానని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు