వావ్.. సూర్య సినిమాలో మోహన్ లాల్

వావ్.. సూర్య సినిమాలో మోహన్ లాల్

తమిళంలో ఒక ఆసక్తికర కాంబినేషన్ తెరమీదికి వచ్చింది. కమల్ హాసన్ తర్వాత తమిళంలో అంతటి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్యతో కలిసి కంప్లీట్ యాక్టర్‌గా గుర్తింపు సంపాదించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఓ భారీ చిత్రంలో కనిపించబోతున్నారు.

రజనీకాంత్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయబోయే ఈ మెగా ప్రాజెక్టుకు ‘రంగం’.. ‘వీడొక్కడే’ చిత్రాల దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నాడు. హారిస్ జైరాజ్ దీనికి సంగీతం అందిస్తాడు. సూర్య-కె.వి.ఆనంద్ కాంబినేషన్లో ఇంతకుముందు ‘వీడొక్కడే’.. ‘బ్రదర్స్’ సినిమాల వచ్చాయి. వీరి కలయికలో ఇది మూడో చిత్రం.

మలయాళంలో తిరుగులేని స్టార్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్.. ఎప్పట్నుంచో వేరే భాషల్లో నటిస్తున్నాడు. ఆయన తమిళంలో ‘ఇద్దరు’ లాంటి ప్రెస్టీజియస్ మూవీలో నటించాడు. హిందీలో ‘కంపెనీ’లో కనిపించాడు. తెలుగులో ‘మనమంతా’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాల్లో కనిపించాడు. ఆయన చాలా ఏళ్ల తర్వాత తమిళంలో నటించబోతుండటం.. అది కూడా సూర్యతో కలిసి కావడంతో ఎంతో క్యూరియాసిటీ కనిపిస్తోంది.

లాల్ ఇతర భాషల్లో మామూలు పాత్రల్ని ఒప్పుకోడు. తన స్థాయికి తగ్గ ప్రత్యేకమైన పాత్ర అయితేనే ఓకే చేస్తాడు. మరి కె.వి.ఆనంద్ ఆయనకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చాడో చూడాలి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని తమిళం.. తెలుగు.. మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English