స‌రే స‌రే....ఇక ఇంటికొచ్చేయ్: చైతూ ట్వీట్ కు సామ్ రీట్వీట్!

స‌రే స‌రే....ఇక ఇంటికొచ్చేయ్: చైతూ ట్వీట్ కు సామ్ రీట్వీట్!

టాలీవుడ్ క్యూట్ పెయిర్ చై-సామ్ లు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రిలోకి స‌మంత త‌న అభిమానులతో ఎక్కువ‌గా ట‌చ్ లో ఉంటుంది. త‌న‌తో పాటు నాగ‌చైత‌న్య ....అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ ను ట్వీట్ చేస్తుంటుంది. రంగ‌స్థలంలో `ల‌చ్చిమి`లాగే....ట్విట‌ర్ లో స‌మంత‌ కూడా త‌న క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ విత్ ఎమోటిక‌న్స్ ...స్పాంటేనియ‌స్ రిప్లైస్ తో అల్ల‌రి చేస్తుంటుంది. తాజాగా మ‌హాన‌టి గురించి చైతూ చేసిన ట్వీట్ కు సామ్ చేసిన రీట్వీట్ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇక ద‌య‌చేసి ఇంటికొచ్చేయ్ చైతూ...అంటూ సామ్ చేసిన ట్వీట్ కు ఆమె అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఫిదా అయ్యారు.

`మ‌హాన‌టి`లో మ‌ధుర‌వాణి పాత్రలో జీవించిన స‌మంత‌పై ట్విట్ట‌ర్ లో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. తాత‌గారు ఏఎన్నార్ పాత్ర‌లో మెప్పించిన చైతూను కూడా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. దీంతో, ఆ చిత్రం పై చైతూ ట్వీట్ చేశాడు. ``కీర్తి సురేష్, దుల్క‌ర్ స‌ల్మాన్, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ల ద‌గ్గ‌ర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజంగా ఇన్ స్పైర్ చేశారు. ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర న‌టించడం గొప్ప అనుభూతి. తాత‌గారి పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంది`` అని....చైతూ ట్వీట్ చేశాడు. దీనికి స‌మంత ఆస‌క్తిక‌రంగా రీట్వీట్ చేసింది. ``స‌రే స‌రే....ఇక ద‌య‌చేసి ఇంటికొచ్చేయ్`` అంటూ ఏడుస్తున్న ఎమోటిక‌న్ ను రీట్వీట్ చేసింది. భ‌ర్త చైతూను మిస్ అవుతున్నాన‌ని....త‌న‌తో టైం స్పెండ్ చేయ‌డానికి ఎదురుచూస్తున్నాన‌ని అర్థం వ‌చ్చేలా  సామ్ చేసిన రీట్వీట్ కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఇద్ద‌రూ షూటింగ్ ల‌తో బిజీగా ఉండ‌డంతో దొరికిన కొద్ది స‌మయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని సామ్ చూడ‌డం....వారి అన్యోన్య దాంప‌త్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు