మహానటి ప్రభంజనం మొదలైంది

మహానటి ప్రభంజనం మొదలైంది

వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ ఖర్చుతో ‘మహానటి’ సినిమాను నిర్మించింది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. అయినప్పటికీ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ప్రి రిలీజ్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ చిత్రానికి మరీ ఎక్కువ స్క్రీన్లు కూడా ఇవ్వలేదు. చిన్న-మీడియం రేంజి సినిమాల స్థాయిలో రిలీజ్ చేశారు. ముందు రోజు బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. ఇది క్లాస్ సినిమా అయినప్పటికీ మల్టీప్లెక్సుల్లో ఓ మోస్తరుగా మాత్రమే బుకింగ్స్ జరిగాయి. కానీ నిన్న మధ్యాహ్నం ఈ చిత్ర టాక్ బయటికి రావడం ఆలస్యం పరిస్థితి మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికీ ఈ స్థాయలో టాక్ రాలేదు. ‘రంగస్థలం’కు కూడా యునానమస్ టాక్ ఏమీ రాలేదు. దానిపై పెదవి విరిచినవాళ్లూ ఉన్నారు.

కానీ ‘మహానటి’ విషయంలో అలా లేదు. అందరూ అద్భుతం అనే అంటున్నారు. సినిమాను తెగ పొగిడేస్తున్నారు. దీంతో ఇంత గొప్పగా చెబుతున్నారే ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అన్న ఉత్సుకత జనాల్లో కనిపించింది. కొన్ని గంటల్లోనే బాక్సాఫీస్ దగ్గర సీన్ మారిపోయింది. ఫస్ట్ షో.. సెకండ్ షోలకు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడిపోయాయి. వీకెండ్ టికెట్ల కోసం పోటీ మొదలైంది. బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కచ్చితంగా పెరిగే అవకాశాలున్నాయి. వీకెండ్ అయితే కచ్చితంగా సినిమా ప్యాక్డ్ హౌస్‌లతో రన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి స్క్రీన్లు పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బిజినెస్‌ జరక్క డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఐతే ఈ చిత్రానికి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే మంచి లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు