సిసలైన సూపర్ స్టార్.. హ్యాట్రిక్ కొడుతుందా?

సిసలైన సూపర్ స్టార్.. హ్యాట్రిక్ కొడుతుందా?

టాలీవుడ్ బ్యూటీ సమంత.. అసలు సిసలైన లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది. స్టార్ హీరోల పక్కన నటించడం మాత్రమే కాదు.. తను నటించడం ద్వారా ఆ పాత్రలకు ఎంతో గుర్తింపు తీసుకువస్తోంది. రంగస్థలం మూవీలో రామలక్ష్మి.. మహానటిలో మధురవాణి పాత్రలు.. ఇందుకు మచ్చుతునకలు మాత్రమే.

ఇవి రెండూ పెళ్లి తర్వాత సమంత సాధించిన ఘనతలు. పెళ్లి తర్వాత మహిళలు హీరోయిన్ గా కొనసాగడమే కష్టం అనుకునే ఫీలింగ్ ను బ్రేక్ చేసి.. ట్రెండ్ సెట్టర్ అయిపోవడమే కాకుండా.. ఆయా పాత్రలను మెప్పించే తీరులో లేడీ సూపర్ స్టార్ అయిపోయింది. నెలన్నర గ్యాప్ లో వచ్చిన రంగస్థలం.. మహానటి చిత్రాలలో.. వేరే ప్రధాన పాత్రలు ఉన్నా.. తన రోల్ తో గుర్తింపు సాధించడం సమంతకే సాధ్యం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇరుంబు తిరాయ్ అంటూ ఓ తమిళ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తోంది ఈ బ్యూటీ.

విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ రేపే విడుదల కానుంది. కోలీవుడ్ లో సుదీర్ఘంగా సాగిన సమ్మె తర్వాత వస్తున్న తొలి భారీ చిత్రం ఇదే అని చెప్పవచ్చు. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం సక్సెస్ ను అందుకుంటే.. సమంత హ్యాట్రిక్ కంప్లీట్ అయిపోతుంది. ఇరుంబు తిరాయ్ ను తెలుగులో అభిమన్యుడు అనే టైటిల్ పై డబ్బింగ్ చేశారు. అయితే.. తెలుగు  వెర్షన్ రిలీజ్ కు కొంత సమయం పట్టనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు