వెంకీతో తేజ సెట్టు కానట్టే

వెంకీతో తేజ సెట్టు కానట్టే

వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా.. దీని గురించి ఓ ఆరు నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ప్రాజెక్టు మాత్రం సాకారం కావడం లేదు. ఆ మధ్యన వెంకీ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కూడా జరిపిన తర్వాత.. ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. వెంకీతో మూవీ చేసే కంటే.. బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ వైపు మొగ్గు చూపాడు తేజ.

మొదట రెండూ హ్యాండిల్ చేద్దామని భావించినా.. తర్వాత వెంకీ సినిమా వదులుకుని బాలకృష్ణ వైపు మొగ్గాడు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు తనే స్వయంగా ప్రకటించేసిన తర్వాత.. సురేష్ బాబు నుంచి మళ్లీ తేజకు పిలుపు వచ్చింది. పలు ఈక్వేషన్స్ ను బేస్ చేసుకుని.. వెంకీతో ప్రాజెక్టును తిరిగి మొదలుపెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. చర్చలు జరిగిన మాట కూడా వాస్తవమే అయినా.. ఇది కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు రానా హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది అంటున్నారు. దాదాపుగా ఇది ఖాయం అయిపోయింది కూడా.

నేనే రాజు నేనే మంత్రి వంటి సక్సెస్ ఫుల్ కాంబో కావడంతో.. ఆసక్తి కూడా కలుగుతోంది. అయితే.. మరి వెంకీతో తేజ సినిమా సంగతేంటి అంటే మాత్రం.. ఇక ఇది సెట్ కానట్లే అని చెప్పుకోవాలి. వెంకటేష్ మూవీని రెండు సార్లు చేజార్చుకున్న తర్వాత.. ఇక మరోసారి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినా.. ట్రేడ్ జనాలను మెప్పించడం కష్టం అయిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు