సాగుతున్నా పూర్తి చేస్తున్న చెర్రీ

సాగుతున్నా పూర్తి చేస్తున్న చెర్రీ

రంగస్థలం సక్సెస్ ను బాగానే ఎంజాయ్ చేసిన రామ్ చరణ్.. ఆ వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు. చెర్రీ రాకకు మునుపే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన బోయపాటి.. ఇప్పుడు కాంబినేషన్ సీన్స్ ను కంప్లీట్ చేసేందుకు ప్లానింగ్ చేశారు. వాటి కంటే పాటే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ ఎపిసోడ్ ను సుదీర్ఘంగానే చిత్రీకరిస్తున్నారు. సినిమా మొత్తానికి ఆయువుపట్టు మాదిరిగా ఉండే ఈ ఫైటింగ్ సీక్వెన్స్ ను అదిరిపోయేలా ప్లాన్ చేశారట. మాస్ జనాలతో ఉర్రూతలు ఊగించే స్థాయిలో ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. అందుకే.. అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులే షూటింగ్ కు సమయం పడుతోందట. షూటింగ్ ప్రోగ్రెస్ కు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ లుక్ మరీ అంత కొత్తగా లేకున్నా.. బోయపాటి స్టైల్ లో మాస్ గానే ఉంది.

మరోవైపు దర్శకుడు బోయపాటి కూడా చాలా ఇంటెన్స్ గా పరిశీలిస్తున్నాడు. షూటింగ్ స్పాట్ ఉన్న బీభత్సాన్ని చూస్తుంటే.. ఈ ఫైట్ ను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారో అర్ధమవుతుంది. అయితే.. ఆ మధ్య ఒకట్రెండు రోజులు చరణ్ షూటింగుకు డుమ్మా కొట్టేయడం కూడా.. ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. ఎలాగూ బోయపాటి చెక్కుడు ఉండనే ఉంటుంది. మొత్తం మీద సాగుతున్నా.. షూటింగ్ మాత్రం ఆగకుండా చేసేస్తున్నారు చెర్రీ అండ్ బోయపాటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు