ఆ సినిమాకి సీక్వెల్ తీస్తారా?

ఆ సినిమాకి సీక్వెల్ తీస్తారా?

టాలీవుడ్ కి సహజంగా సీక్వెల్స్ అంటే భయం. గతంలో ఎప్పుడూ తెలుగులో సీక్వెల్స్ గా వచ్చిన సినిమాలు ఆడిన పాపాన పోలేదు. అందుకే ఎలాంటి హిట్టు బొమ్మకి అయినా కొనసాగింపుగా తీసేందుకు ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. ఆర్య2 అండ్ గబ్బర్ సింగ్ 2 అందుకు ఉదాహరణలు. కానీ బాహుబలి-2తో ఇలాంటి భయాలకు బ్రేక్ పడిపోయింది. సరైన కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తే.. మెప్పించచ్చు అని నమ్ముతున్నారు టాలీవుడ్ మేకర్స్.

అందుకే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు నెక్ట్స్ పార్ట్ తీసే యోచనలు జరుగుతున్నాయి. వీటిలో అన్నిటికంటే ఎక్కువగా.. హాట్ కేక్ మాదిరిగా వినిపిస్తున్న పేరు రేసుగుర్రం. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్. అప్పటికి బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచి బ్లాక్ బస్టర్ అయింది కూడా. ఆ ఏడాది అదే పెద్ద హిట్ కూడా. అలాంటి సినిమాకు సీక్వెల్ మాటలు సాగుతున్నాయట. అంటే స్టోరీ పరంగా కంటిన్యూ చేయకపోయినా.. బన్నీ రోల్ మాత్రం క్యారీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

రేసుగుర్రం మూవీలో బన్నీ మ్యానరిజమ్స్ దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్ వరకూ విభిన్నంగా ఉంటాయి. ఆ పాత్ర ఛాయలతోనే కొత్త కథ అల్లుకు వస్తారట. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే బన్నీ చేస్తున్నాడట కానీ.. సురేందర్ రెడ్డి సైరాతో మూవీతో ఫుల్లు బిజీగా ఉన్నాడు. అందుకే వేరే స్టార్ డైరెక్టర్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించే పనులు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు