అమీర్.. సల్మాన్.. అంటున్న చరణ్

అమీర్.. సల్మాన్.. అంటున్న చరణ్

రెండేళ్ల ముందు వరకు రామ్ చరణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు. కెరీర్ ఆరంభంలోనే మాస్‌ లో మాంచి ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు కానీ.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ అతను చేరువ కాలేకపోయాడు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన సినిమాలు చేయలేక రేసులో వెనుకబడిపోయాడు. ‘బ్రూస్ లీ’ అతడిని దారుణమైన దెబ్బ కొట్టింది. అలాంటి స్థితిలో ‘ధృవ’ సినిమాతో అతను సాహసం చేశాడు. అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. క్లాస్ ప్రేక్షకుల్లో అతడికి నెమ్మదిగా ఫాలోయింగ్ మొదలైంది. ఇప్పుడు ‘రంగస్థలం’లో అన్ని వర్గాల
ప్రేక్షకులకూ రౌండప్ చేశాడు. ఈ చిత్రం అతడి కెరీర్ కు మేలిమలుపుగా  నిలిచింది. నటుడిగా తనేంటో రుజువు చేసుకోవడమే కాదు.. కమర్షియల్‌ గా కూడా అసాధారణ ఫలితాన్నందుకుని శిఖరంపై నిలిచాడు చరణ్.

తనలో వచ్చిన ఈ మార్పుకి.. మున్ముందు సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండటానికి బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ స్ఫూర్తి అని చరణ్ చెబుతుండటం విశేషం. వాళ్లిద్దరు ఎంచుకునే కథల్లో ఎంతో వైవిధ్యం ఉంటుందని.. అదే సమయంలో కమర్షియల్ విలువలకు ఢోకా లేకుండా చూసుకుంటారని.. అలా ఎక్కువ మంది ప్రేక్షకుల మనసు గెలుస్తూ పెద్ద విజయాలు
అందుకుంటున్నారని చరణ్ చెప్పాడు. తాను కూడా కథల ఎంపికలో వారి బాటలోనే  పయనిస్తున్నానని.. ఇక ముందు కూడా అదే దారిలో వెళ్తానని చెప్పాడు చరణ్.

వరుసగా రెండు వైవిధ్యమైన సినిమాలు చేసిన చరణ్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏమాత్రం వైవిధ్యం ఉంటుందన్నది  దేహమే. ఐతే దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తో కలిసి చేయబోయే మల్టీస్టారర్ మాత్రం చరణ్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు