మెగా ఫోటోల చుట్టూ కామెడి

మెగా ఫోటోల చుట్టూ కామెడి

ఇక్కడ చిరంజీవి ఫోటో లేదని కామెడి. అక్కడ చిరంజీవి ఫోటో ఉందని కామెడి. ఎక్కడికి వెళ్ళినా కామెడి మాత్రం కామన్‌గానే ఉంటోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మెగాస్టార్‌ చిరు సతీసమేతంగా కాన్స్‌ చిత్రోత్సవానికి వెళ్ళారు. అక్కడకు ఆయనతోపాటు కొడుకు చరణ్‌, కోడలు ఉపాసన కూడా వచ్చారు.

అయితే మనోళ్ళు ఇంటర్నేషనల్‌ ఐకాన్స్‌ కాదుకాబట్టి, ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్లు వీరి వెంటపడరు. దానిని అలుసుగా తీసుకున్న కొంతమంది ఔత్సాహికులు, మెగా హీరోలిద్దరూ విద్యాబాలన్‌ను పట్టేసుకొని, ఆవిడ సాయంతో అక్కడ ఫోటోలకు ఫోజులిచ్చారంటూ కామెడి చెయ్యడం స్టార్‌ చేశారు. ఇక నిన్న జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సదస్సులు, చిరు ఫోటో పెట్టలేదు.

ఒకవేళ ఈ అంశం పెద్ద దుమారానికి తెరలేపుతుందేమోనని, మంత్రి దానం నాగేందర్‌ చిరు వర్గీయులకు క్షమాపణలు చెప్పారు. చిరు ఫోటో లేదు, ఎందుకంటే కిరణ్‌కు ఆయనకు పడదు కాబట్టి ఆయన ఫోటో తీశేసారు అంటూ మరో  కామెడి స్టార్ట్‌ చేశారు ఇంకొంతమంది ఔత్సాహికులు. మొత్తానికి మెగా ఫోటోలను ఆ విధంగా వాడేసుకుంటున్నారనమాట.