ఐ లవ్యూ చెప్పడానికి స్పీడెందుకు?

ఐ లవ్యూ చెప్పడానికి స్పీడెందుకు?

''తేజ్ ఐ లవ్యూ'' అంటూ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఫుల్లు స్పీడ్ తో వచ్చేస్తున్నాడు. సహజంగా దర్శకుడు కరుణాకరన్.. సినిమా తీసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ తేజుతో తీస్తున్న లేటెస్ట్ మూవీ విషయంలో మాత్రం మాంచి జోరు మీదున్నాడు ఈ దర్శకుడు.

తేజ్ ఐ లవ్యూ అంటూ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. రీసెంట్ గా పారిస్ షెడ్యూల్ ను పూర్తి చేశామని.. ఔట్ పుట్ పై ఫుల్లు ఖుషీగా ఉన్నామని అంటున్నారు. ఇంకా కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉండగా.. దీన్ని కూడా ఈ నెల 18కల్లా ఫినిష్ చేసేస్తామని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయని వెల్లడించారు. ఓ సినిమాను ఇంత వేగంగా పూర్తి చేసేయడం.. నిజానికి అభినందించాల్సిన విషయమే.

అయితే.. తేజు ట్రాక్ రికార్డ్ ప్రస్తుతం బాగాలేదు. వరుసగా డిజాస్టర్ల మీద డిజప్పాయింట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఫిబ్రవరిలో వచ్చిన 'ఇంటిలిజెంట్' చేసిన గాయాలు తేజు అండ్ టీంకు తగ్గాయేమో కాని.. సాయిధరమ్ ఫ్యాన్స్ కు ఆడియన్స్ కు తగ్గలేదు. కాస్త వెయిట్ చేసి మంచి కథ చూసుకుని స్లోగా రావొచ్చు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. రికార్డు టైములో కరుణాకరన్ డైరక్షన్లో ఇలా వచ్చేస్తుండడం కూడా ఇప్పుడు సినిమా లవ్వర్స్ కు పెద్దగా కిక్కివ్వట్లేదు. ఇంత హడావిడిగా కాకుండా.. కాసింత నెమ్మదిగా అయినా.. ఔట్ పుట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవచ్చుగా అనేది వారి వాదన.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English