చెప్పను బ్రదర్ to చూసుకోండి బ్రదర్

చెప్పను బ్రదర్ to చూసుకోండి బ్రదర్

మెగా ఫ్యామిలీలో గొడవలు.. ఘర్షణలు.. కొన్ని రోజుల క్రితం వరకూ మీడియాకు ఇదో క్రేజీ పాయింట్. చిరంజీవి-పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్- అల్లు అరవింద్.. పవన్- బన్నీ.. చరణ్- బన్నీ.. చిరు- అరవింద్.. చరణ్-బన్నీ.. ఇలా దాదాపు అన్ని రకాలుగాను.. విబేధాలు ఉన్నాయంటూ బోలెడన్ని కథనాలు గుట్టలకొద్దీ వచ్చాయి.

తామంతా ఒకటే అనే విషయాన్ని పలు మార్లు చెప్పినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. మొన్నటివరకు బోలెడన్ని గొడవలు అన్నారు. పట్టింపులు ఉన్నాయన్నారు. కాని ఇప్పుడు అందరూ కలసిపోయారు. ఒక్క దెబ్బకు అందరూ ఒక్కటి అనే విషయం అందరికీ అర్ధం అయేలా చేశారు. ఏ రోజయితే పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ దగ్గర హంగామా చేశాడో.. ఆ క్షణం నుంచి మెగా హీరోల మధ్య విబేధం.. అన్న మాటే వినిపించడం లేదంటే ఆశ్చర్యం వేయకమానదు.

నిజానికి విబేధాలపై వచ్చిన మాటలకు ఆధారాలు లేకపోలేదు. చిరు-పవన్ లు వేరు వేరు పార్టీలు.. గతంలో పార్టీ విషయంలో అల్లు అరవింద్ వ్యవహారం పవన్ కు నచ్చకపోవడం అన్నీ నిజాలే. అయితే.. ఆ విబేధాలు అన్నీ తాత్కాలికమైన సంగతులే అయిపోయాయి. చెప్పను బ్రదర్ అంటూ పీక్స్ కి చేరిన రచ్చ.. ఇప్పుడు కలిసిపోయాం చూసుకోండి బ్రదర్ అన్నట్లుగా మారిపోయింది. వీళ్లేం చేసినా వీళ్లకీళ్లే సాటి అన్నట్లుగా ఉంది కదూ మెగా ఫ్యామిలీ వ్యవహారం. ఇంతకీ మెగా ఫ్యామిలీలో అసలేం జరుగుతోందబ్బా అనిపిస్తోంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు