తాత అంటే ఈ హీరోకి ఎంతిష్టమో

తాత అంటే ఈ హీరోకి ఎంతిష్టమో

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామందే ఉన్నారు. వీరిలో సుమంత్ ది ప్రత్యేకమైన శైలి అని చెప్పవచ్చు. ఏఎన్నార్ మనవడిగా.. నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్.. పెద్దాయనపై బోలెడంత మమకారం ప్రదర్శిస్తూ ఉంటాడు. అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో ఎన్నో మధురమైన రోజులు ఉంటాయి.

వీటిలో ప్రతీ ఒక్కటీ సుమంత్ కు కొట్టిన పిండి అంటే ఆశ్చర్యం వేయక మానదు. ఏఎన్నార్ కు సంబంధించి సుమంత్ పెట్టే ట్వీట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. '74 ఏళ్ల క్రితం శ్రీ సీతా రామ జననం చిత్రంలో లీడ్ రోల్ లో కనిపించిన రోజు ఇది' అంటూ ఏఎన్నార్ లైఫ్ లో ఇవాల్టి ప్రత్యేకత గురించి చెప్పిన సుమంత్.. ఆ నాటి ఫోటోను ప్రచురించిన ఓ పాత న్యూస్ పేపర్ ఆర్టికల్ కు సంబంధించిన లింక్ కూడా ఇచ్చాడు. నిజంగా ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉండగా.. సుమంత్ కు ఇంత స్పెషల్ గా ఎలా డేట్స్ గుర్తుంటాయా అని అనుకోవచ్చు.

నిజానికి ప్రతీ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీ నుండి సుమంత్ ఒక్కడే ఇలాంటి ట్వీట్స్ వేసి ఆయన్ను గుర్తు చేసుకుంటాడు. అందరూ బర్తడే కి ట్వీటేస్తే.. సుమంత్ మాత్రం ఫస్ట్ మూవీ.. ఫస్ట్ సక్సెస్ అంటూ చాలా విషయాలు చెబుతుంటాడు. మిగతా వాళ్లకు ప్రేమ లేదని కాదు కాని.. సుమంత్ కు మాత్రం తాతగారు అంటే ఎక్కువ ఇష్టం. వీళ్ళ అమ్మానాన్నా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాక.. ఆయన సుమంత్ కొడుకుగా దత్తత చేసుకున్నారు కూడా. బహుశా అదే ఎఫెక్షన్ సుమంత్ ను ఏఎన్నార్ కు ఇంత దగ్గర చేసి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English