ఎన్టీఆర్ ఎలా ఉంటాడో..

ఎన్టీఆర్ ఎలా ఉంటాడో..

తెలుగులో మరో ఆసక్తికర సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. అలనాటి నటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ బుధవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. సావిత్రి జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించామని చిత్ర బృందం చెబుతోంది. ఐతే సావిత్రి జీవితం ఎలా సాగిందన్నదానికంటే ఇందులోని కాస్టింగ్ జనాలకు ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోంది.

సావిత్రితో కలిసి సినిమాలు చేసిన.. ఆమెతో వ్యక్తిగత అనుబంధం ఉన్న నటీనటులు.. సాంకేతిక నిపుణుల పాత్రలు.. వాటిని పోషించిన వ్యక్తులు జనాల్లో ఆసక్తిని పెంచారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తే.. ఆమె భర్త జెమిని గణేశన్ క్యారెక్టర్లో దుల్కర్ సల్మాన్ ను చూడబోతున్నాం. ఇంకా ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య.. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు.. కేవీ రెడ్డిగా క్రిష్.. చక్రపాణిగా ప్రకాష్ రాజ్.. ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.ఐతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలన్న చిత్ర బృందం ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే.

మరి సినిమాలో ఎన్టీఆర్‌ ను ఎలా చూపిస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘కలిసుందాం రా’.. ‘యమదొంగ’ సినిమాల్లో మాదిరి డిజిటల్ రూపంలో ఎన్టీఆర్ కనిపిస్తారన్న ప్రచారం ఇంతకుముందు నుంచి ఉంది. కానీ ఈ చిత్రంలో అనేక సర్ప్రైజులున్నాయంటూ చిత్ర నిర్మాతలు చెబుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రను ఎవరో ఒకరితో చేయించే ఉంటారని.. ఎవరో ఒకరు నటిస్తే తప్ప ఒరిజినాలిటీ ఉండదని.. డిజిటల్ రూపంలో చూస్తే సహజత్వం పోతుందని భావించారని ఒక ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో ఏది నిజమో చూడాలి. ఈ సస్పెన్సుకి మరి కొన్ని గంటల్లో తెరపడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English