హీరోయిన్ల‌కు మెహెందీ స్పెష‌లిస్టు ఈవిడే

హీరోయిన్ల‌కు మెహెందీ స్పెష‌లిస్టు ఈవిడే

డస్కీ బ్యూటి సోన‌మ్ క‌పూర్ పెళ్లికూతురైపోయింది. మెహెందీ వేడుక కూడా ఘ‌నంగా జ‌రిగిపోయింది. ఆ రోజు ఆమె చేతులు గోరింటాకుతో నింపేసింది ముంబైకి చెందిన ఒక మెహెందీ స్పెష‌లిస్టు. ఆమె చేత మెహెందీ వేయించుకోవ‌డం బాలీవుడ్‌లో ఒక ఆన‌వాయితీగా మారిపోయింది. దాదాపు ఇప్ప‌టి టాప్ హీరో హీరోయిన్ల పెళ్లిళ్ల‌న్నిటీలోనూ మెహెందీ పెట్టింది ఈమెనే. ఆవిడ ఎవరో చూద్దాం పదండి.

బాలీవుడ్‌లో ఏ హీరోయిన్ పెళ్లి అవ్వనివ్వండి... ఏ హీరో పెళ్లి కానీయండి మెహెందీ వేడుక‌కు మాత్రం క‌చ్చితంగా వీణా న‌గ‌డా వెళ్లాల్సిందే. గ‌త ఇర‌వై ఏళ్లుగా ఆమెనే ఎక్కువ మంది హీరోయిన్ల‌కు చేతుల కాళ్ల‌నిండా గోరింటాకు డిజైన్ల‌తో నింపేస్తోంది. ఏ డిజైన్ అయినా కోరిక వెంట‌నే చ‌క‌చ‌కా వేసేయడం ఈమె ప్ర‌త్యేక‌త. అందుకేనేమో కోరి మ‌రీ బాలీవుడ్ హీరోయిన్లంతా ఈమె చేత మెహెందీ పెట్టించుకుంటారు. బాలీవుడ్ మెహెందీ క్వీన్ గా పేరు పొందింది వీణా న‌గ‌డా. ప‌దోత‌ర‌గ‌తితో చ‌దువు ఆపేసింది. కాల‌క్షేపం కోసం చీర‌ల‌పై ఎంబ్రాయిడ‌రీలు కుడుతూ మెహెందీ డిజైన్లు పెట్టేది. అలా పెళ్లిళ్ల‌కు కూడా పెట్ట‌డం ప్రారంభించింది. సంజ‌య్‌ఖాన్ కూతురు ఫ‌రాఖాన్ త‌న పెళ్లికి ఆమెను పిలిచి మెహెందీ పెట్టే అవ‌కాశం ఇచ్చింది. అలా వీణా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌రువాత హృతిక్ రోష‌న్ పెళ్లిలో పెట్ట‌డంతో బాగా పాపుల‌ర్ అయిపోయింది.

హృతిక్ రోష‌న్ పెళ్లిలో అత‌ని భార్య సుజాన్ ఖాన్‌కు చ‌క్క‌ని డిజైన్లు వేసింది. కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్ పెళ్లిలో, క‌రిష్మా క‌పూర్ పెళ్లిలో, ఐశ్వ‌ర్యారాయ్ శిల్పాశెట్టి, ట్వింకిల్ ఖ‌న్నా, కాజోల్, రాణిముఖ‌ర్జీ, గీతా బ‌స్రా ఇలా ఎంతోమందికి మెహెందీ దిద్దింది. స‌ర‌దాగా శ్రీదేవి, అలియా భ‌ట్ కూడా అప్పుడ‌ప్పుడు ఆమెను పిలిచి మెహెందీ డిజైన్ పెట్టించుకునే వారు. రెండు చేతుల‌కు కాళ్ల‌కు పెట్టినందుకు తాను రూ.3000 నుంచి రూ.7000 వ‌ర‌కు తీసుకుంటాన‌ని చెప్పింది. పేరు ఆ రేంజులో ఉన్నా.. ఆమె ప్రైస్ మాత్రం చీపేనండోయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు