'ఏరా నాని' అనేసింది.. అదుపేలేదా?

 'ఏరా నాని' అనేసింది.. అదుపేలేదా?


శ్రీరెడ్డి.. కొన్ని వారాల క్రితం వరకు టాలీవుడ్ సెన్సేషన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా భూకంపం తీసుకొచ్చేసింది. చేసిన ఒకే ఒక్క మిస్టేక్ దెబ్బకు మీడియా ఈమె గురించి పట్టించుకోవడమే మానేసింది. ఇంటర్వ్యూలు ఇస్తాను మొర్రో అంటున్నా.. ఒక్క ఛానల్ కూడా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు.

తన పోరాటం అనే పాయింట్ ను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్న శ్రీరెడ్డి.. ఏదేమైనా సరే అందరి గుట్టు బైటకు తెస్తానని అంటోంది. ఎంతవరకు తెస్తుందో.. ఎవరు పట్టించుకుంటారో అప్పుడే చెప్పలేం కానీ.. సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న పోస్టులకు ప్రస్తుతం వెబ్ సైట్స్ నుంచి తప్ప మరే యాంగిల్ నుంచి కవరేజ్ లేదు. రీసెంట్ గా ప్రెస్ క్లబ్ కు వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చిన శ్రీరెడ్డి.. హీరో నానిని తిట్టిపోసింది. నానితో పాటు శేఖర్ కమ్ముల పేరు కూడా మరోసారి ప్రస్తావించిన శ్రీరెడ్డి.. మరో పోస్ట్ ద్వారా నానిని మళ్లీ టార్గెట్ చేసింది. పైగా సింగిల్ లైన్లో 'ఒరేయ్ నాని' అంటూ మాట్లాడుతుంటే.. సినిమా లవ్వర్స్ ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు. ఈమెకు అసలు అదుపేలేదా అని ప్రశ్నిస్తున్నారు.

కాని ఖండించాలంటే మాత్రం అందరూ కాస్త భయపడుతున్నారు. ఈవిడ ఎలాంటి వారినైనా 'ఏరా' సంబోధనలు చేసేయవచ్చట. ఛిఛీలు కూడా చాలానే ఉంటాయి. కానీ నెట్లో ఈమెను ఎవరైనా తిడితే మాత్రం కేసులు పెట్టేస్తుందట. ఆ మధ్యన తన లాయర్ తో అదే విషయాన్ని చెప్పించింది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు వార్నింగులు కూడా ఇస్తోంది. తను తిట్టచ్చు.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవచ్చు. చూపించిన ఆధారాల్లో.. ఈవిడను బలవంతం చేసినట్లు లేవనే సంగతి గుర్తుంచుకోవాలి. మరి ఇలా తాను ఎవరిని ఎలా తిట్టినా సరే.. వారు కానీ.. వారి అభిమానులు కానీ తిడితే కేసులు పెట్టేస్తానంటే.. ఏమనాలో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు