బన్నీ అంచనాలు ఎట్టా తప్పేశాయ్??

బన్నీ అంచనాలు ఎట్టా తప్పేశాయ్??

అల్లు అర్జున్ ఇప్పటివరకూ తన సినిమాలతో.. రేంజ్ పెంచుకుంటూనే వెళుతున్నాడు. బన్నీ అంత నిలకడగా హిట్స్ ఇచ్చిన మరో స్టార్ హీరో టాలీవుడ్ లో లేడంటే అదేమీ అతిశయోక్తి కాదు. అలాంటి అల్లు అర్జున్ కి.. ఇప్పుడు నా పేరు సూర్య షాక్ ఇచ్చేలాగే కనిపిస్తోంది. ఫుల్ రన్ లో ఎబౌ యావరేజ్ వరకూ గానీ.. జస్ట్ బ్రేక్ఈవెన్ వరకు గానీ రావచ్చంతే. అంతకు మించి అయితే సూర్యకు సీన్ లేదని అనేస్తున్నారు ట్రేడ్ జనాలు.

నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా వసూళ్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. బన్నీ గత చిత్రం డీజే-దువ్వాడ జగన్నాధం కు డివైడ్ టాక్ వచ్చినా.. తొలి వీకెండ్ ముగిసేసరికి 43 కోట్ల షేర్ వచ్చింది. ఆ తర్వాత దాదాపు మరో 30 కోట్లను జమ చేసుకోగలిగింది డీజే. కానీ నా పేరు సూర్య మాత్రం తొలి వారాంతంలో 36 కోట్ల దగ్గరే షేర్ ఆగిపోయింది. అంటే డీజే కంటే దాదాపు 20 శాతం వసూళ్లు తగ్గాయన్న మాట. అయినా.. నా పేరు సూర్య విషయంలో రిజల్ట్ ను బన్నీ ఎలా ఎక్స్ పెక్ట్ చేసి ఉంటాడు.. కంటెంట్ విషయంలో ముందే ఏమీ డౌట్ రాలేదా అనే అనుమానం సహజం.

సీరియస్ థీమ్ ను సిన్సియర్ గా ట్రై చేశామని చెబుతున్నారు కానీ.. నిజానికి బన్నీకి స్ట్రెంగ్త్ అయిన జోనర్ నుంచి పక్కకు జరగడమే ఇలాంటి రిజల్ట్ కు కారణంగా చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ కి విపరీతమైన స్ట్రెంగ్త్ ఉన్న జోనర్లు ఫన్ అండ్ యాక్షన్. దువ్వాడ జగన్నాధం పాస్ అయిపోవడానికి కారణం కూడా అదే. కానీ నా పేరు సూర్యలో ఎమోషన్ కోసం.. ఫన్ ను దాదాపుగా పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా కారణం కావచ్చని అంటున్నారు.

కంటెంట్ కాసింత డల్లుగా ఉన్నా డీజే మూవీనే ఆడేసినపుడు.. పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న సూర్య.. సక్సెస్ తీరాలకు చేరడం ఈజీనే అని భావించి ఉంటాడని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా.. బన్నీ జడ్జిమెంట్ మాత్రం ఈసారి మిస్ అయిందని చెప్పవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు