మహేష్ బాబా.. క్రిస్మస్ తాతా?

మహేష్ బాబా.. క్రిస్మస్ తాతా?

ప్రతీ క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ తాత అయిన శాంటా క్లాజ్ వచ్చి గిఫ్టులు ఇస్తుంటాడు. నిజంగా క్రిస్మస్ తాత వచ్చి బహుమతులు ఇస్తాడో లేదో చెప్పలేం కానీ.. మహేష్ బాబు మాత్రం నిజమైన శాంటాక్లాజ్ గా మారిపోతున్నాడు. గిఫ్టులు తెగ పంచిపెట్టేస్తున్నాడు.

భరత్ అనే నేను మూవీ సక్సెస్ పై ముందు నుంచి మంచి కాన్ఫిడెంట్ తో ఉన్న మహేష్ బాబు.. అందుకు తగినట్లుగానే మీడియా జనాలకు ఐఫోన్స్ పంచాడనే టాక్ ఉంది. ఇక దర్శకుడు కొరటాల శివ విషయంలో మహేష్, మరీ ఉదారంగా ఉంటున్నాడు. శ్రీమంతుడు సక్సెస్ సమయంలో ఓ లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చిన సూపర్ స్టార్.. ఇప్పుడు హైద్రాబాద్ పరిసరాల్లో ఓ లగ్జరీ విల్లాను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీని ఖరీదు చాలానే ఉంటుందని.. ప్రస్తుతం సినీ జనాలు నివసిస్తున్న కాస్ట్లీ పోష్ విల్లాస్ లో ఇది కూడా ఒకటి అనే టాక్ వినిపిస్తోంది.

రేటు ఎంత అనే విషయం బైటకు రాలేదు కానీ.. రెమ్యూనరేషన్ రూపంలోనే గట్టి మొత్తాన్ని అందుకున్న కొరటాల శివ.. ఇప్పుడు విల్లా రూపంలో బోనస్ అందుకున్నాడు. ఇంత ఖరీదైన గిఫ్టులు ఇస్తున్న మహేష్ బాబును.. శాంటాక్లాజ్ తో పోల్చేస్తున్నారు సినిమా జనాలు. మహేష్ ను మెప్పించి.. మంచి హిట్ అందిస్తే.. ఏ స్థాయిలో గిఫ్టులు అందుకోవచ్చో అర్ధం అవడంతో. చాలామంది ఔత్సాహిక ఫిలిం మేకర్స్.. ఇప్పుడు మహేష్ ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్టులు ప్రిపేర్ చేసేసుకుంటున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English