మళ్ళీ డిప్రెషన్లో మల్లూ బ్యూటి

మళ్ళీ డిప్రెషన్లో మల్లూ బ్యూటి

అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య కోసం చాలా కష్టపడ్డ అల్లు అర్జున్.. మంచి రిజల్ట్ ను ఎక్స్ పెక్ట్ చేయడంలో ఆశ్చర్యం లేదు. స్టార్ రైటర్ ఇమేజ్ సంపాదించుకున్న వక్కంతం వంశీ.. దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో.. ఈయన కూడా హోప్స్ బాగానే పెట్టుకున్నాడు. వీరికంటే ఎక్కువగా నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియాపై ఆశలు పెట్టుకున్న వ్యక్తి మరొకరు ఉన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఎన్నారై మల్లు బ్యూటీ అను ఇమాన్యుయేల్.. నా పేరు సూర్య మూవీ సక్సెస్ పై చాలానే హోప్స్ పెట్టుకుంది. ఈమె గత చిత్రం అజ్ఞాతవాసి.. ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో తెలిసిన విషయమే. పవన్ తో చేసిన ఆ మూవీ రిజల్ట్ తనను చాలా డిజప్పాయింట్ చేసిందని.. పలు మార్లు చెప్పింది అను ఇమాన్యుయేల్. ఇప్పుడు నా పేరు సూర్య విషయంలో.. మరీ ఇంత దారుణమైన ఫలితం కాకపోయినా.. హిట్టు అందుకునే ఛాయలు అయితే అంతగా కనిపించడం లేదు.

ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు వచ్చినపుడు ఎంత సంతోషించిందో.. ఇప్పుడు రెండు సినిమాలు బోల్తా కొట్టేస్తుండడంతో.. అంతే డిజప్పాయింట్ కావాల్సి వస్తోందట. పైగా ఈ చిత్రంలో అను పాత్రకు విమర్శలు ఎదురవుతున్నాయి. తొలి వీకెండ్ తర్వాత గట్టి ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ భావించినా.. అసలు సపోర్ట్ చేయడం లేదట. నా పేరు సూర్య ప్రమోషనల్ యాక్టివిటీస్ కు డుమ్మా కొట్టేయాలని ఫిక్స్ అయిన ఈ మల్లు బ్యూటీ.. అసలు నిర్మాతల ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు