అక్కినేని అండ గురించి సమంత..

అక్కినేని అండ గురించి సమంత..

సమంత రూత్ ప్రభు కాస్తా గత ఏడాది సమంత అక్కినేనిగా మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద ఫ్యామిలీల్లో ఒకదానికి సమంత కోడలిగా మారింది. ఆ విషయంలో చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్న సమంత.. పెళ్లయిన మరుసటి రోజే తన పేరు వెనుక అక్కినేనిని చేర్చుకుంది. సినిమా కార్యక్రమాల్లో అయినా.. ఇంకెక్కడైనా అక్కినేని కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుతోంది సామ్. అదే సమయంలో సమంత గురించి కూడా నాగార్జున ప్రతిసారీ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతూ.. ‘కోడలా కోడలా’ అని సంబోధిస్తున్నాడు. తాజాగా సమంత మరోసారి తన అత్తింటి వారి గురించి మాట్లాడింది. తనకు వాళ్లిచ్చే సపోర్ట అంతా ఇంతా కాదంది. తాను ఎలా ఉన్నానో అలాగే ఉండనిస్తున్నారని.. అదే వాళ్లు తనకిచ్చే పెద్ద సపోర్ట్ అని సమంత అంది.

పెళ్లి చేసుకున్నాక తాను నటించిన ‘రంగస్థలం’లో లిప్ లాక్ సీన్ చేయడం గురించి చాలామంది సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసినట్లు సమంత వెల్లడించింది. నిజానికి ఆ సీన్ కెమెరా ట్రిక్ అని.. బుగ్గ మీద పెట్టిన ముద్దును లిప్ లాక్‌గా మార్చారని సమంత చెప్పింది. కానీ ఆ విషయం తెలియక చాలామంది తనను ట్రోల్ చేశారని ఆమె అంది. ప్రతి ఒక్కరికీ తాను వివరణ ఇవ్వాల్సిన పని లేదని.. ఏ ఫ్యామిలీ గురించైతే జనాలు మాట్లాడుతున్నారో ఆ ఫ్యామిలీ తనకు అండగా ఉందని.. ముఖ్యంగా తన మావయ్య తనకు మామూలు సపోర్ట్ ఇవ్వట్లేదని సమంత చెప్పింది. అయినా ఒక పెళ్లయిన హీరో లిప్ లాక్ చేస్తే ఎవరూ అడగరని.. కానీ కథానాయిక విషయంలో మాత్రమే ఈ అభ్యంతరాలు.. పట్టింపులు ఏంటో తనకు అర్థం కావడం లేదని సమంత ఆవేదన వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు