మహేష్‌ అండ్ బన్నీ వేదాంతం అందుకే

మహేష్‌ అండ్ బన్నీ వేదాంతం అందుకే

రావల్సిన సినిమాలు వచ్చేశాయి. చూడాల్సిన వారందరూ చూసేశారు. ఇప్పుడు మన స్టార్ హీరోలు సినిమా రిలీజ్ కు ముందు ఏం చెప్పారా అని చూసుకుంటే.. కచ్చితంగా మనకు వారి వేదాంతం తాలూకు విపరీతార్దం మరియు తాత్పర్యం అర్ధమైపోతుంది. అదేనండీ.. భరత్ అను నేను రిలీజవ్వడానికి ముందు మహేష్‌ చేసిన కామెంట్లు.. నా పేరు సూర్య కోసం తానిచ్చిన ఏకైక ఇంటర్యూలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు జనాలకు అర్దమవుతున్నాయ్.

ఇక మీదట నేను ప్రయోగాత్మక సినిమాలు చేయను అంటూ మహేష్ బాబు కామెంట్ చేశాడు. అయితే అది భరత్ నేను నేను సినిమాను ఉద్దేశించి అన్నాడంటూ ప్రచారం జరిగితే.. అబ్బే కాదండీ అనేశాడు. కాని నిజం చెప్పాలంటే.. ఆ సినిమా పబ్లిసిటీ టీమ్ చేసిన బీభత్సమైన ప్రమోషన్ల వలనే సినిమాకు ఒక రేంజులో వసూళ్ళు వచ్చాయి. లేదంటే చాలా యావరేజ్ గా ఉండేవి. అందుకే సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న వెంటనే.. ఇటువంటి ప్రమోషన్లు ఇంక చాలు బాబోయ్ అనుకుని.. మహేష్‌ మనకు ప్రయోగాల జోలికి వెళ్ళనంటూ వేదాంతం చెప్పాడు.

మరో ప్రక్కన నా పేరు సూర్య ఇంటర్యూల్లో.. బన్నీ మాట్లాడుతూ.. ఏ హీరో అయినా కూడా తమ మనస్పుకు నచ్చే విధంగా కొన్ని క్యారక్టర్లు చేయాలని.. మసాలా సినిమాలే కావాలని చూడకూడదని కామెంట్ చేశాడు. కాని అలా చెబుతున్నప్పుడే సినిమా రిజల్టుపై కాస్త సందేహం వచ్చింది. ఆ ఇంటర్యూలో మరోచోట.. ఒక విషయం చెప్పాలి అంటూ మూడు నిమిషాలు ఆలోచించి.. అబ్బే రిలీజ్ తరువాత మాట్లాడతా అన్నాడు. ఆ వేదాంతం అంతా చూస్తే.. సినిమా కాస్త తేడాపడిందని అప్పుడే కొందరు డీకోడ్ చేశారు. ఇప్పుడు అదే నిజమైంది కూడాను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English