మహానటి విషయంలో అదే పెద్ద డౌట్

మహానటి విషయంలో అదే పెద్ద డౌట్

మనకి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు.. కాని చూసేవారికి సినిమా చూసిన తరువాత ఏం ఫీలింగ్ వస్తుంది అనేదే అసలైన పాయింట్. అదే బ్యూటీ ఆఫ్ సినిమా అంటే. నిజానికి మహావీర్ సింగ్ ఫోగట్ చాలా కష్టపడ్డాడట అని పేపర్లలో ఎన్నిసార్లు చదివినా రాని కిక్.. ఒక్కసారిగా 'దంగల్' సినిమాను చూసినప్పుడు మాత్రం.. కూతుళ్ల కోసం ఎంత చేశాడ్రా బాబూ అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. అందుకే సినిమా సునాయసంగా 300 కోట్లు వసూలు చేసింది.

మన పాయింట్ లోకి వెళితే.. తెలుగుతెరపై అప్పుడెప్పుడో 'అల్లూరి సీతారామరాజు' అనే బయోపిక్ చూసిన మనం.. ఇప్పుడు మరోసారి 'మహానటి' అంటూ మరో తెలుగు కెరటం తాలూకు జీవితం తెరపై చూడబోతున్నాం. అయితే ఈ సినిమా కంటెంట్లో ఏం చూపించబోతున్నారు అనే ఉత్సుకత ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఎందుకంటే.. మనకి మనం 'మహానటి' అంటూ ఎంత చెప్పినా కూడా.. ఇప్పుడున్న యూత్ కు అసలు కొమ్మారెడ్డి సావిత్రి గురించి ఏమాత్రం తెలియదు. కాబట్టి తెరమీద చూపించే తీరును బట్టే.. వారికి ఆమె కథ అర్దమవుతుంది. మరి మానవ సంబంధంలాను స్పృశిస్తూ వారి ఎమోషన్ ను టచ్ చేస్తే.. దంగల్ తరహాలో మదిని తడితే.. మహానటి పెద్ద హిట్టే అవుతుంది. కాని అక్కడే పెద్ద డౌట్ వస్తోంది.

ఎందుకంటే ఈ సినిమాలో మనం స్టోరీ అండ్ ఎమోషన్ గురించి ఆలోచించేలోపే.. ఈ పాత్రలో ఈ నటుడు.. ఆ పాత్రలో ఆ నటి అంటూ సినిమాను కొంతమంది ప్రస్తుత స్టార్లతో చాలా ఓవర్ క్రౌడ్ చేస్తున్నారనేది సినిమా విశ్లేషకుల వాదన. హాలీవుడ్లో 'గాంధి' సినిమా తీసిన.. బాలీవుడ్ లో 'దంగల్' తీసినా.. అందులో అందరూ దాదాపు కొత్తవారే. ఒక మెయిన్ క్యారక్టర్ తప్పించి, అందరూ కథకు తగ్గట్లు ఎన్నుకోబడిన వారే. కాని ఈ సినిమాకు మాత్రం.. అసలే సినిమావాళ్ళ సినిమా కావడంతో, కాస్త సినిమాటిక్ గ్లామర్ ఎక్కువైంది. కథ తాలూకు ఔన్నత్యం అండ్ ఎమోషన్ డైల్యూట్ కాకుండా ఈ స్టార్లు కాపాడగలరా? లెటజ్ వెయిట్ అండ్ సి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు