ఫ్లాప్‌ దెబ్బతో నాని కేర్‌ఫుల్‌

ఫ్లాప్‌ దెబ్బతో నాని కేర్‌ఫుల్‌

సూపర్‌స్టార్లు ఒకటి రెండు ఫ్లాపులు అఫార్డ్‌ చేయగలరు కానీ మధ్య శ్రేణి హీరోలు ఫ్లాప్‌ల బారిన పడితే కోలుకోవడం కష్టమవుతుంది. ఇంతకాలం వరుసగా విజయాలు అందుకున్న నానికి 'కృష్ణార్జున యుద్ధం'తో పెద్ద షాక్‌ తగిలింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాబట్టుకోలేక డిజాస్టర్‌ అయిన ఈ చిత్రం నానిని అలర్ట్‌ చేసింది. మాస్‌ హీరో కావాలనే కాంక్షతో కాస్త ట్రాక్‌ మార్చిన నానికి ఈ చిత్రంతో జ్ఞానోదయం అయింది.

అందుకే అంతకుముందు మాస్‌ కథలు, కమర్షియల్‌ స్క్రిప్టులు తీసుకురమ్మని డిమాండ్‌ చేసిన వాడే ఇప్పుడు మళ్లీ కంటెంట్‌ ప్రధాన చిత్రాలు కావాలని చెబుతున్నాడట. రొటీన్‌ సినిమాలు చేయవద్దని రాజమౌళి లాంటి వాళ్లు సలహాలు ఇచ్చినా ప్రేక్షకులు చూసేస్తున్నారనే నెపంతో వాటికే కట్టుబడ్డ నానికి ఒక్క సినిమాతోనే రియలైజేషన్‌ వచ్చేసింది.

అన్ని సక్సెస్‌లు ఇచ్చినా కానీ గత చిత్రం ఫలితం ఏంటనేది మిడిల్‌ రేంజ్‌ హీరో కెరియర్లో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో అతను ఓకే చేసిన రెండు కమర్షియల్‌ కథలని కూడా వదిలేసుకున్నాడట. ప్రస్తుతానికి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తానని, మధ్యలో ఎపుడైనా కమర్షియల్‌ చిత్రాలు ట్రై చేస్తానని చెబుతున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English