రవితేజ చేతిలోకి పవన్‌ సినిమా

రవితేజ చేతిలోకి పవన్‌ సినిమా

పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లే ముందుగా మైత్రి మూవీస్‌లో ఒక చిత్రం చేద్దామని అనుకున్నాడు. పవన్‌ని ఎలాగైనా ఒప్పించడానికి ఆగమేఘాల మీద ఒక కథ సిద్ధం చేసారు. తమిళ చిత్రం 'తెరి' కథని తీసుకుని తెలుగుకి అనుగుణంగా పలు మార్పుచేర్పులు చేసారు.

అది అప్పటికే తెలుగులోకి పోలీసోడు పేరిట అనువాదమైనా కానీ ఈ వెర్షన్‌ బాగా వచ్చిందని, అంచేత ఎలాగైనా పవన్‌ కళ్యాణ్‌ డేట్స్‌ సాధించాలని చూసారు. కానీ పవన్‌ పాలిటిక్స్‌తో బిజీ కావడంతో ఆ కథ అలా మిగిలిపోయింది. మరికొందరు హీరోలని అదే కథతో సంప్రదించారు కానీ అవేమీ వర్కవుట్‌ కాలేదు. ఫైనల్‌గా రవితేజ ఆ చిత్రం చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది.

సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ లాంఛ్‌ చేసారు. ఇందులో రవితేజ సరసన కాజల్‌, క్యాథరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో రవితేజతో మైత్రి చేసుకున్న రెండు చిత్రాల ఒప్పందం పూర్తయింది. శ్రీను వైట్లతో రవితేజ చేస్తోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రాన్ని కూడా మైత్రి సంస్థ నిర్మిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు