అల్లు అర్జున్‌ మ్యాజిక్‌ పని చేయట్లే

అల్లు అర్జున్‌ మ్యాజిక్‌ పని చేయట్లే

అల్లు అర్జున్‌ ఇటీవల చేసిన చిత్రాల్లో 'రేసు గుర్రం' మినహా అన్నిటికీ నెగెటివ్‌ టాకే వచ్చింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా సన్నాఫ్‌ సత్యమూర్తి అబోవ్‌ యావరేజ్‌గా, సరైనోడు పెద్ద హిట్‌గా, డిజె యావరేజ్‌గా నిలిచాయి. తన సినిమాకి ఏ టాక్‌ వచ్చినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ అండదండలతో అల్లు అర్జున్‌ సత్తా చాటుకుంటూ వచ్చాడు. అయితే ఈసారి తన ప్రధాన బలమైన ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చని కంటెంట్‌తో వచ్చి మూల్యం చెల్లించుకుంటున్నాడు.

'నా పేరు సూర్య' చిత్రానికి కూడా బన్నీ అన్ని చిత్రాల్లానే డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు లేకపోవడం, అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ చాలా సీరియస్‌గా వుండడం, యాక్షన్‌ మోతాదు మించడంతో పాటు మార్కెట్లో హిట్‌ సినిమాలుండడం 'నా పేరు సూర్య'కి ప్రతికూలంగా మారింది. మొదటి రోజు మంచి వసూళ్లే తెచ్చుకున్నా కానీ ఆ తర్వాత ఈ చిత్రం నిలబడలేకపోయింది. శని, ఆదివారాల్లోనే కలక్షన్లు తగ్గుముఖం పట్టడంతో ఇక వీక్‌ డేస్‌లో వసూళ్లు రావడం కష్టమని తేలిపోయింది.

అల్లు అర్జున్‌ సినిమాలు సహజంగా రెండవ రోజు నుంచీ బాగా స్ట్రాంగ్‌గా వుంటుంటాయి. అతని సినిమాలకి రెండవ రోజున రికార్డులు వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. అలాంటిది 'నా పేరు సూర్య' క్రాష్‌ అవడం అల్లు అర్జున్‌కి షాక్‌ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు