చైనాలో బాహుబలి-2.. నాట్ బ్యాడ్

చైనాలో బాహుబలి-2.. నాట్ బ్యాడ్

‘బాహుబలి: ది బిగినింగ్’ ఇండియాలోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది. కానీ చైనాలో మాత్రం ఆ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎంతో హడావుడి చేసి రిలీజ్ చేస్తే పది కోట్ల వసూళ్లు కూడా రాలేదు. కేవలం రిలీజ్ ఖర్చులకే వచ్చిన వసూళ్లు సరిపోయాయి. ‘బాహుబలి’ తరహా సినిమాలు చైనీయులకు మామూలే కాబట్టి దీన్ని ఆదరించలేదని.. రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగా జరగలేదని అన్నారు.

ఐతే ఇప్పుడు ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించారు. ప్రమోషన్లు బాగా చేశారు. కాస్త హైప్ తీసుకురాగలిగారు. ఈ చిత్రం మే 4న చైనా వ్యాప్తంగా 7 వేల స్క్రీన్లలో రిలీజైంది. ‘బాహుబలి-1’కు భిన్నంగా దీనికి ప్రి సేల్స్ బాగా వచ్చాయి. తొలి రోజే 2.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిందీ చిత్రం.

వీకెండ్ అంతా కూడా ‘బాహుబలి-2’ బాగానే పెర్ఫామ్ చేసింది. ఇప్పటిదాకా 8 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయడం విశేషం. అంటే రూపాయల్లో 50 కోట్లకు పైనే వసూలయ్యాయన్నమాట. దీన్ని బట్టి చూస్తే ‘బాహుబలి-1’తో పోలిస్తే రెండో భాగం చాలా బాగా ఆడుతున్నట్లే అన్నమాట. ఇదే జోరు కొనసాగిస్తే రూ.100 కోట్ల మార్కును కూడా ‘ది కంక్లూజన్’ అందుకునే అవకాశముంది. ఐతే అమీర్ ఖాన్ సినిమాలు ‘దంగల్’.. ‘సీక్రెట్ సూపర్ స్టార్‌’లతో మాత్రం దీనికి అసలు పోలికే లేదు. ‘దంగల్’ ఏకంగా రూ.1200 కోట్ల దాకా వసూలు చేసింది చైనాలో. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ రూ.700 కోట్ల దాకా కొల్లగొట్టింది.

సల్మాన్ చిత్రం ‘భజరంగి భాయిజాన్’ రూ.300 కోట్ల దాకా రాబడితే.. ‘హిందీ మీడియం’ లాంటి చిన్న సినిమా రూ.200 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఈ వసూళ్లు చైనాలో ఇండియన్ సినిమాకు ఆదరణ ఎలా పెరుగుతోందో చెప్పడానికి నిదర్శనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు