ఆ నేచరే కాజల్ కు కలిసొస్తోంది

ఆ నేచరే కాజల్ కు కలిసొస్తోంది

నిజానికి స్టార్ హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉండనే ఉంటోంది. అయితో ఇప్పుడు మాత్రం టాలీవుడ్ అంత ఓవర్ లోడ్ అయిపోయిందనే చెప్పాలి. సమంత అండ్ రకుల్ ప్రీత్ టాప్ పొజిషన్లో ఉన్నారనుకుంటే.. మేం వాళ్లకి పోటీ అంటూ రాశి ఖన్నా అండ్ అనుపమ పరమేశ్వరన్ వంటి భామలు వచ్చారు. ఈ మధ్యలో సాయి పల్లవి.. కీర్తి సురేష్‌.. అను ఎమ్మానుయేల్ వంటి పోరీలు ఒక ఊపు ఊపినా.. ఇప్పుడు మాత్రం పూజా హెగ్డే అండ్ కియారా అద్వానీలు వరుసగా పెద్ద హీరోల సినిమాలు సైన్ చేస్తూ.. ఫుల్ బిజీ అయ్యారు. అయితే ఇంతమంది వచ్చినా కూడా.. కాజల్ డిమాండ్ కాజల్ కే ఉంది తెలుసా. అమ్మడు ఇంకా పెద్ద హీరోల దగ్గర నుండి కబురు వింటూనే ఉంది. రవితేజ్.. రానా వంటి స్టార్లతో సినిమాలు సైన్ చేస్తూనే ఉంది. మరి హౌ??

ఒక ప్రక్కన కాజల్ 2 కోట్లు అగుడుతుంది అంటూ ఎన్ని డిమాండ్లు వినిపించినా కూడా.. కాజల్ చూపించే ప్రొఫెషనలిజం కమ్ ఆమె ఎడ్జస్టింగ్ నేచర్ ఆమెకు అన్నేసి సినిమాలు రావడానికి కారణం అంటున్నారు. వాస్తవంగా ఒక ఫారిన్ షూట్ కు వెళ్ళినప్పుడు.. డ్యాన్సులు చేస్తుండగా డ్రస్సు కనుక వెనుక భాగంలో ఎక్కడన్న చిరిగినా.. లేదంటే ఎక్కడైనా కుట్లు ఊడిపోయినా.. సగం రోజు షూటింగును మన మద్దుగుమ్మలు ఇట్టే క్యాన్సిల్ చేస్తారట.

కాని కాజల్ మాత్రం.. చిరిగినంతవరకు టేప్ అతికించుకుని యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయట. పలానా ఫుడ్డే కావాలి.. పలానా హోటల్ నుండే తేవాలి అంటూ మారాం చేయదట. అసలు తన డైట్ తనే తెచ్చుకుంటుందట. ఆ నేచర్ కారణంగా నిర్మాతలకు డేట్స్ వేస్ట్ అవ్వవని.. డబ్బులు కూడా సేవ్ అవుతాయని.. అందుకే ఆమెకు ఇంకా అంత డిమాండ్ అంటున్నారు కొందరు మేనేజర్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు