500 కోట్లు ఆల్రెడీ కుమ్ముకున్నారుగా..

500 కోట్లు ఆల్రెడీ కుమ్ముకున్నారుగా..

సంక్రాంతి, సమ్మర్, దసరా.. ఇవే తెలుగు ఫిలిం ఇండస్ర్టీకి సంబంధించి అతి పెద్ద సీజన్లు. మామూలుగా పెద్ద హీరోలు సినిమాల అయితే ఎప్పుడైనాసరే వచ్చేసి కలక్షన్లు కొల్లగొట్టేస్తాయిలే. కాని చాలా సినిమాలు మూకుమ్మడిగా ఒకేసారి దాడి చేయాలంటే మాత్రం.. ఈ సీజన్లే అనువైన సమయం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఉంటాయ్.. పెద్దాళ్ళకూ సెలవలు ఉంటాయి.. గవర్నమెంట్ ఇచ్చే హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి.. సినిమాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ పెద్దగా వాడుకోలేకపోయింది కాని.. సమ్మర్ ను మాత్రం ఒక విధంగా కుమ్మేసిందనే చెప్పాలి. మార్చి 30న రిలీజైన రంగస్థలం నుండి.. మొన్న శుక్రవారం వచ్చిన నా పేరు సూర్య వరకు.. టాక్ ఎలా ఉన్నా కూడా.. పైసల్ మాత్రం ఫుల్లుగా వసూలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రంగస్థలం సినిమా 200 కోట్లు వసూలు చేయగా, భరత్ అను నేను కూడా 190 కోట్లు గ్రాస్ మార్క్ టచ్ చేసిందని ప్రొడ్యూసర్లు అంటున్నారు. అలాగే నా పేరు సూర్య కూడా మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి 80+ గ్రాస్ వసూలు చేసిందట. అంటే షుమారూ ఈ మూడు పెద్ద సినిమాలే 470+ కోట్ల రూపాయలు వసూలు చేశాయనమాట. ఈ పెద్దాళ్లకు మధ్యలో వచ్చిన చల్ మోహన్ రంగ, కృష్ణార్జున యుద్దం, మెర్య్కూరి, ఆచారి అమెరికా యాత్రం, కణం వంటి సినిమాలన్నీ కలుపుకుని ఇంకో 30 కోట్లు ఈజీగా వసూలు చేసుంటాయి. ఆ లెక్కన చూస్తే ఆల్రెడీ 500 కోట్లు కుమ్మేశారు టాలీవుడ్డోళ్ళు.

ఇకపోతే మరో నెల రోజుల పాటు సమ్మర్ వేడి.. సమ్మర్ సెలవలు.. రెండూ ఉన్నాయ్. ఈ టైములో మనోళ్ళు మహానటి, మెహబూబా, జంబ లకడి పంబ, టాక్సీవాలా, నేల టిక్కెట్, ఆఫీసర్, నా నువ్వే తదితర సినిమాలతో వస్తున్నారు. ఎవ్వరినీ ఎక్కువగా అంచనాలు వేయలేం కాని, అలాగని తక్కువ చేసీ చూడలేం. అందరూ కలసి ఒక 100 కోట్లు కొట్టేశే ఛాన్సుంది. అంటే సింపుల్ గా మనోళ్ళు 600 కోట్లు ఈ సమ్మర్ సాక్షిగా ఆడియన్స్ జేబులనుండి కొల్లగొట్టేసినట్లే. ఆ రేంజులో జనాలను కూడా ఎంటర్టయిన్ చేశారనే చెప్పాలిలే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు