మలయాళ సినిమాలో నాగార్జున?

మలయాళ సినిమాలో నాగార్జున?

అక్కినేని నాగార్జున కేవలం తెలుగు నటుడు కాదు. ఆయన హిందీ.. తమిళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ఇప్పుడు నాగ్.. మలయాళ భాషలోకి కూడా అడుగుపెడుతున్నాడు. మోహన్ లాల్ హీరోగా మహాభారత కథతో తెరకెక్కబోయే చిత్రంలో ఓ పాత్ర కోసం నాగార్జునను అడిగినట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. దాని సంగతి ఇంకా ఏమీ తేలలేదు. ఈలోపే నాగ్‌కు అక్కడి నుంచి మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అది కూడా మోహన్ లాల్ సినిమానే కావడం విశేషం.

మోహన్ లాల్‌తో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సీనియర్ డైరక్టర్ ప్రియదర్శన్.. మరోసారి తన మిత్రుడితో ‘మరాక్కర్’ అనే సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగార్జునను ఖరారు చేశాడట ప్రియదర్శన్. ఇందులో మరో పాత్ర కోసంబాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఫిక్స్ చేశారట. నాగార్జునతో ప్రియదర్శన్‌కు మంచి అనుబంధం ఉంది. తెలుగులో ఆయన నాగ్ హీరోగా ‘నిర్ణయం’ తీశాడు.

ప్రియదర్శన్ తనయురాలు కళ్యాణిని ‘హలో’ సినిమాలో అఖిల్‌కు జోడీగా తీసుకున్నాడు నాగ్. ప్రస్తుతం తెలుగులో నాగ్ నాని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. గత ఏడాది ‘ఓం నమో వేంకటేశాయ’.. ‘రాజు గారి గది-2’ చిత్రాలతో కంగుతిన్న నాగార్జున ఇప్పుడు ఓ హిట్టు కోసం చూస్తున్నాడు. వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆఫీసర్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English