బాబు తీరుకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా

బాబు తీరుకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా

ఔను. నిజంగా నిజం. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడ‌పై బాలీవుడ్ హీరోయిన్ ప్రశంసలు కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుకు ఆమె ఫిదా అయ్యారు. ఇంత‌కీ బాలీవుడ్ నటి ఎవరంటే దియా మీర్జా. ఎందుకు ఇంత‌లా ప్రశంసించారనే క‌దా మీ సందేహం. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తాజాగా చెప్పారు క‌దా అందుకు!

గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు వేగంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. దాచేపల్లి బాధితురాలికి వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటానని చంద్రబాబు ఇచ్చిన హామీ వార్తపై నటి దియా మీర్జా స్పందించారు. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణయం ఇచ్చిన హామీలపై ప్రశంసలు కురిపించారు. ఈ మేర‌కు దియా మీర్జా ట్వీట్‌ చేస్తూ..`చంద్రబాబు అంటే నాకు చాలా గౌరవం. ఆయన చాలా మంచి వ్యక్తి’ అని పోస్ట్‌ చేశారు. బాధితురాలి చదువుకు అయ్యే ఖర్చులను వ్యక్తిగతంగా నేను భరిస్తాను. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటాను’ అని చంద్రబాబు చెప్పడం చాలా గొప్పని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని స్పష్టం చేశారు. దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చని అన్నారు. బాలివుడ్ నటి ట్వీట్‌ను ఓ ఆంగ్లపత్రిక ప్రచురించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు