మన భామలకు న్యూయార్కులో ఏం పని?

మన భామలకు న్యూయార్కులో ఏం పని?

మన సినిమా తారలు విదేశాల్లో సందడి చేయడం సహజమే. రకరకాల ఈవెంట్స్ కోసం.. ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాల కోసం స్టార్లు పలు దేశాలకు వెళుతుంటారు. ప్రముఖ తారలకు అయితే ప్రత్యేక ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. ఆయా కార్యక్రమాలను ఆకర్షణీయంగా మార్చేందుకు.. విజిటర్స్ ను ఆకర్షించేందుకు ఫిలిం స్టార్స్ ను ఇన్వైట్ చేయడం కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు కూడా కొంత మంది హీరోయిన్లు న్యూయార్క్ లో ఉన్నారు. కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఆల్రెడీ ఓ వారం నుండి అక్కడే ఉంది. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి కూడా విదేశాలకు బయల్దేరింది. ఈమె పయనం కూడా న్యూయార్క్ కే అని తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి ఈవెంట్స్ జరగడం లేదు. అలాంటి సమయంలో.. సడెన్ సుందరాగులు న్యూయార్క్ లో ఏం చేస్తున్నారబ్బా? అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే.. న్యూయార్క్ లో కొన్ని ఎన్నారై మీటింగులు వరుసగా ప్లాన్ చేశారట.

రీసెంట్ గా అక్కడ జరిగిన ఎన్నారైల మీటింగుల్లో పాల్గొనడానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్.. లావణ్య త్రిపాఠి కూడా అందుకే వెళ్ళారని తెలుస్తోంది. ఈ మీటింగుల ఉద్దేశ్యమేంటో.. సారాంశమేంటో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎలాగూ సోషల్ మీడియాలో అప్ డేట్స్ వస్తూనే ఉంటాయ్ కాబట్టి.. బ్యూటీలు న్యూయార్క్ విజిట్ వెనుక సీక్రెట్ ఏంటో కొంతకాలం ఆగితే తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు