బాహుబలి2కి ఫస్ట్ టైం బ్యాడ్ రేటింగ్స్

బాహుబలి2కి ఫస్ట్ టైం బ్యాడ్ రేటింగ్స్

బాహుబలి.. టాలీవుడ్ వరకు చరిత్ర సృష్టించిన సినిమా. బాహుబలి2 దగ్గరకి వచ్చేసరికి..  టోటల్ ఇండియానే షేక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కాకుండా.. కేవలం ఇండియా వసూళ్లను మాత్రమే లెక్కిస్తే.. ఇప్పుడప్పుడే బాహుబలి2 దరిదాపుల్లోకి రావడం ఏ సినిమాకైనా కష్టమే.

అలాంటి ఘనమైన హిస్టరీ ఉన్న బాహుబలి సిరీస్ కి చైనాలో మాత్రం చుక్కెదురు అవుతోంది. బాహుబలి ది బిగినింగ్ ను అక్కడ భారీగా రిలీజ్ చేశారు. అయినా సరే.. అక్కడ సూపర్ ఫ్లాప్ అయిపోయింది. దీంతో ఈసారి నిర్మాతలు తమ ఇంటెలిజెన్స్ అప్లై చేశారు. మొదటగా జపాన్ మార్కెట్ లో విడుదల చేసి.. అక్కడ హిట్ అంటూ ఊదరగొట్టేసి.. హండ్రెడ్ డేస్ లాంటి సెలబ్రేషన్స్ కూడా చేసి.. స్వయంగా రాజమౌళి జపాన్ వెళ్లొచ్చి మరీ హైప్ పెంచేందుకు ప్రయత్నించారు. ఇంతకీ బాహుబలి2 జపాన్ లో బాగానే తెచ్చింది కాని.. అన్నీ దేశాలు సినిమాను అలాగే ఆదరిస్తాయ్ అంటే కుదరదు సుమీ.

ఆ సంగతి పక్కన పెడితే.. ఈ బజ్ ను బేస్ చేసుకుని చైనాలో మళ్లీ భారీగా రిలీజ్ చేసే సాహసం చేశారు బాహుబలి మేకర్స్. ఏకంగా 7వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. తొలి రోజున 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయంటూ భారీ హంగామా కూడా నడుస్తోంది. నిజానికి ఈ మొత్తం చాలా తక్కువ అనే విషయాన్ని దాచిపెడుతున్నారు. ఇంతకంటే చాలా తక్కువ థియేటర్లలో విడుదల అయిన హిందీ మీడియం లాంటి చిన్న సినిమాకు అక్కడ 3.42 మిలియన్ డాలర్లు తొలిరోజున దక్కాయి.

పైగా చైనా పత్రికలు అన్నీ ఈ గ్రాఫికల్ మూవీని తేల్చిపడేశాయి. మౌత్ టాక్ కూడా చాలా డల్లుగా ఉందని చైనా పేపర్స్ చెబుతున్నాయి. ఇక్కడ అంటే రాజులు.. యుద్ధాలు లాంటి కాన్సెప్ట్ లతో చాలా అరుదుగా సినిమాలు వస్తాయి కాబట్టి.. నాణ్యమైన గ్రాఫిక్స్ బేస్డ్ గా వచ్చే సినిమాలు తక్కువ కాబట్టి.. బాహుబలి2 ప్రభంజనం సృష్టించడం సాధ్యం అయింది. కానీ చైనీస్ మూవీ మేకర్స్.. ఈ థీమ్ ను ఎప్పుడో పీల్చి పిప్పి చేసి ఎండేసి ఆరేసేశారు. అందుకే ఈ సినిమా కాసింత కూడా ఆకట్టుకోలేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు