ప్రభాస్ గురించి డబ్బా ఆపండబ్బా

ప్రభాస్ గురించి డబ్బా ఆపండబ్బా

‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించాడు. అన్ని భాషల్లోనూ అతడికి ఫాలోయింగ్ వచ్చింది. మార్కెట్ కూడా ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని ‘సాహో’ టీం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రభాస్ మార్కెట్ బాగా విస్తరించిందన్న నమ్మకంతో ఈ చిత్రానికి రూ.200 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్లు చెబుతున్నారు. దాని మీద ఇంకో వంద కోట్లు అదనంగానే బిజినెస్ జరిగే అవకాశాలున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాల్సి ఉంది. ఇదలా ఉంటే ‘సాహో’ను నేషనల్ లెవెల్లో భారీగా రిలీజ్ చేయడానికి ఎక్కువగా బాలీవుడ్ నటీనటుల్నే ఈ చిత్రం కోసం తీసుకున్నారు. హీరోయిన్‌గా శ్రద్ధ కపూర్ నటిస్తుండగా.. విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. ఇంకా జాకీష్రాఫ్, ఎవిలీన్ శర్మ.. మరో ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారట.

వీళ్లందరికీ కేవలం నటన కోసమే కాక ప్రభాస్‌ను పొగడ్డానికి.. తరచుగా మీడియాలో అతడి గురించి స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా పారితోషకాలు ఇచ్చినట్లుగా ఉంది పరిస్థితి చూస్తుంటే. నిజానికి శ్రద్ధ. . నీల్ నితిన్.. మిగతా వాళ్లు ఎవ్వరూ కూడా మీడియాకు దొరికే పరిస్థితి లేదు. వాళ్లు మాత్రం బాలీవుడ్ మీడియాను పిలిచి పిలిచి ప్రభాస్ గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ప్రభాస్‌లోని బెస్ట్ క్వాలిటీస్ గురించి ప్రతిసారీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ‘బాహుబలి’ లాంటి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రంలో తాము నటించడం ఎంత గొప్ప అదృష్టమో అని మురిసిపోతున్నారు. ఇదంతా బాలీవుడ్ మీడియాలో తరచుగా ప్రభాస్‌ను చర్చల్లో ఉంచి అక్కడ అతడికి ఫాలోయింగ్ పెంచడానికి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్న ప్రచారం లాగా ఉంది. వాళ్ల ఫీలింగ్ ఏంటో కానీ.. చాలా సింపుల్‌గా ఉండే ప్రభాస్ గురించి వాళ్లు అదే పనిగా డబ్బా కొట్టడం మన జనాలకే చిరాకు తెప్పిస్తోంది. కాబట్టి ఈ ప్రచారాలకు ఇక తెరదించితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు