ఫస్ట్ హాఫ్ ముందే చూపించేస్తున్నాడు

ఫస్ట్ హాఫ్ ముందే చూపించేస్తున్నాడు


రిజల్ట్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక స్టాండెడ్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో విశాల్. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ తమిళ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే విశాల్ ఇంకా కెరీర్ లో అనుకున్నంత రేంజ్ లో స్టార్ హీరోలకు పోటీని ఇవ్వలేకపోతున్నాడు. అయినప్పటికీ అతని ప్రయత్నంలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. వరుసగా ప్రయోగాత్మకమైన కథలని తెస్తూనే ఉన్నాడు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. విశాల్ నెక్స్ట్ ఈరంబు తిరయ్ అనే సినిమా ద్వారా రాబోతున్నాడు. తెలుగులో అభిమన్యుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాబోయే రెండు రోజులకు ముందు మీడియాకు స్పెషల్ షో వేయనున్నాడట విశాల్. ఫుల్ సినిమా కాకుండా కేవలం ఫస్ట్ హాఫ్ వరకు ప్రెస్ కు చూపించాలని అనుకుంటున్నారు. సినిమాకు మీడియా నుంచి స్పెషల్ క్రేజ్ రావాలని విశాల్ ఆ విధంగా ప్లాన్స్ వేసికున్నాడట. అంతే కాకుండా సినిమా మీద ఉన్న నమ్మకంతో కూడా విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడాని తెలుస్తోంది. కాని ఫస్టాఫ్‌ బాగున్నా కూడా.. సెకండాఫ్‌ ఎలా ఉంది అనే దానిపై సినిమా సక్సెస్ ఆధారపడుతుంది. కాదంటారా? ఆ విషయంలో విశాల్ ఏమని చెబుతాడో మరి. 15 నిమిషాలు చూపించే ప్రయోగాలు ఆల్రెడీ చాలామంది చేయగా.. ఇప్పుడు ఏకంగా గంట సినిమా అంటున్నాడు. చూద్దాం ఈ ప్రయోగం ఏమవుతుందో

సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో విశాల్ అద్భుతంగా నటించడాని సౌత్ లో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ కూడా నమ్మకంతో చెబుతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయిక నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు