భారతీయుడు-2 ఆశలు వదిలేయాల్సిందేనా?

భారతీయుడు-2 ఆశలు వదిలేయాల్సిందేనా?

రెండుrn దశాబ్దాల కిందట సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసేసింది rn‘భారతీయుడు’ సినిమా. సౌత్ సినిమా అంటే ఏంటో బాలీవుడ్ వాళ్లకు రుచి చూపించినrn సినిమా ఇది. కథాకథనాలు.. నటన విషయంలో ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలు rnనెలకొల్పింది. మళ్లీ కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎన్నో rnఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ‘భారతీయుడు’కి సీక్వెల్ వస్తే బాగుంటుందని rnఅనుకుంటున్నారు. ఎట్టకేలకు ఆ కల నెరవేరబోతున్న సంకేతాలు అందాయి. తామిద్దరం rnకలిసి ‘భారతయుడు-2’ చేయబోతున్నట్లు గత ఏడాదే వెల్లడించాడు శంకర్. జనవరి 26నrn తైవాన్‌లో లొకేషన్ల కోసం రెక్కీ కూడా నిర్వహించి వచ్చాడు శంకర్. కమల్ rnహాసన్ కూడా ఈ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అన్నీ అయ్యాయి కానీ.. rnఇప్పటిదాకా ఈ చిత్రం ప్రారంభం మాత్రం కాలేదు.

కొన్నిrn రోజుల కిందటి వరకు ఈ సినిమాకు ఆశలున్నాయి కానీ.. ప్రస్తుత పరిణామాల rnనేపథ్యంలో సందేహాలు కలుగుతున్నాయి. ఓవైపు కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ rnఅయిపోతున్నాడు. మరి కొన్ని నెలల్లో ఉద్ధృతంగా కార్యక్రమాలు చేయాలని rnప్రణాళికలు రచించుకున్నాడు. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ‘భారతీయుడు-2’ మొదలు rnపెట్టి చకచకా ఆ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ శంకర్ ‘2.0’ rnనుంచి బయటపడట్లేదు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిందీ చిత్రం. జూన్, జులై rnనెలలకైనా సినిమా రెడీ అవుతుందని.. తర్వాత కమల్‌తో సినిమా మొదలుపెడతాడని rnఅనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అసలు ‘2.0’ ఎప్పుడు రెడీ అవుతుందో rnక్లారిటీ కూడా లేదు. వీఎఫెక్స్ పనుల్లో జాప్యం చిత్ర బృందాన్ని అయోమయంలోకి rnనెట్టేసింది. అసలు ఈ ఏడాది ఆ సినిమా రావడమే సందేహం అంటున్నారు. ఒక సినిమా rnపని పూర్తి చేసి.. అది రిలీజయ్యాక కానీ వేరే సినిమాలోకి వెళ్లడు శంకర్. rnఅతను ఈ ఏడాది ఫ్రీ అవ్వని పరిస్థితుల్లో ‘భారతీయుడు-2’ చేయడం కష్టమే. వచ్చేrn ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నుంచి కమల్ పూర్తిగా rnరాజకీయాల్లో బిజీ అయిపోతాడు. కాబట్టి ‘భారతీయుడు-2’ ముందుకు కదలడం కష్టమే rnఅంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు